Share News

బాధితులకు సత్వర న్యాయం జరగాలి

ABN , Publish Date - May 05 , 2026 | 12:06 AM

ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై పోలీస్‌ అధికారులు నిబద్ధతతో వ్యవ హరించి బాధితులకు చట్టపరి ధిలో సత్వరం న్యాయం అం దించాలని ఎస్పీ కేవీ మహే శ్వర రెడ్డి ఆదేశించారు.

బాధితులకు సత్వర న్యాయం జరగాలి
ఫిర్యాదులదారులతో మాట్లాడుతున్న ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి

ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం క్రైం, మే 4 (ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై పోలీస్‌ అధికారులు నిబద్ధతతో వ్యవ హరించి బాధితులకు చట్టపరి ధిలో సత్వరం న్యాయం అం దించాలని ఎస్పీ కేవీ మహే శ్వర రెడ్డి ఆదేశించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమ వారం ప్రజా ఫిర్యాదుల స్వీక రణ, పరిష్కార వేదికను నిర్వ హించారు. జిల్లా నలుమూలల నుంచి సుమారు 79 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఫిర్యాదుదారుల వద్దకు వెళ్లి స్వయంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలను పరిశీలించి వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్ల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పీజీఆర్‌ ఎస్‌లో వచ్చే ఫిర్యాదులు, వాటి పరిష్కా రంపై ఎప్పటికప్పుడు కేసుల పురోగతిని జిల్లా కార్యాల యానికి అందజేయాలని సూచించారు.

Updated Date - May 05 , 2026 | 12:06 AM