27న జిల్లాకు ఉపరాష్ట్రపతి రాక
ABN , Publish Date - Apr 25 , 2026 | 12:05 AM
Vice President visit ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను ఈ నెల 27న జిల్లాకు రానున్నారు. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి.. గార మండలం శ్రీకూర్మంలో కూర్మనాథుడ్ని దర్శించుకోనున్నారు.
ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
గార/ శ్రీకాకుళం క్రైం, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను ఈ నెల 27న జిల్లాకు రానున్నారు. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి.. గార మండలం శ్రీకూర్మంలో కూర్మనాథుడ్ని దర్శించుకోనున్నారు. శుక్రవారం శ్రీకూర్మనాథ ఆలయంలో ఏర్పాట్లను కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, దేవదాయశాఖ అధికారులు పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఆలయ ప్రాంగణంలో విద్యుత్ రఫరా, మంచినీరు, పారిశుద్ధ్యంతోపాటు పుష్కరిణి, అన్నదాన సత్రం, తదితర చోట్ల పరిశుభ్రత పాటించాలని ఆలయ అధికారులను ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి చర్చించారు. కలెక్టర్, ఎస్పీ వేర్వేరుగా స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. కార్యక్రమంలో ఆర్డీవో సాయిప్రత్యూష, డీఎస్పీ సీహెచ్ వివేకానంద, దేవదాయశాఖ సహాయ కమిషనర్ ప్రసాద్‌పట్నాయక్, ఈవో వాసుదేవరావు, సీఐ పైడిపునాయుడు, ఎస్‌ఐ గంగరాజు, ఆలయ అర్చకులు సీతారామ నరసింహాచార్యులు, కిషోర్‌బాబు పాల్గొన్నారు.
హెలీప్యాడ్ పరిశీలన
ఉప రాష్ట్రపతి జిల్లా పర్యటనలో ఆయన ప్రయాణించే హెలీకాప్టర్లు ల్యాండింగ్ కోసం డచ్‌బంగ్లా, పోలీస్‌క్వార్టర్స్ మైదానాలను కలెక్టర్, ఎస్పీ శుక్రవారం పరిశీలించారు. డచ్‌బంగ్లా వద్ద ప్రధాన హెలీప్యాడ్‌కు అనుబంధంగా మరొకటి నిర్మించాలని కలెక్టర్ ఆదేశించారు. పోలీస్‌క్వార్టర్స్‌లోనూ అదనపు హెలీప్యాడ్ నిర్మాణానికి స్థలాన్ని ఖరారు చేస్తూ యుద్ధప్రాతిపదికన పనులు పూర్తిచేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు స్పష్టం చేశారు. అనంతరం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ, పోలీస్, ఇతర ఉన్నతస్థాయి అధికారులు పాల్గొన్నారు.