Share News

ప్రధాన కూడళ్లలో వాహన తనిఖీలు

ABN , Publish Date - Oct 23 , 2026 | 12:03 AM

ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున మండలంలోని అలికాం-బత్తిలి ప్రధాన రోడ్డు కూడళ్లలో ఫ్లయింగ్‌స్క్వాడ్‌ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.

 ప్రధాన కూడళ్లలో వాహన తనిఖీలు
వాహనాన్ని తనిఖీ చేస్తున్న అధికారులు

ఎల్‌.ఎన్‌.పేట, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున మండలంలోని అలికాం-బత్తిలి ప్రధాన రోడ్డు కూడళ్లలో ఫ్లయింగ్‌స్క్వాడ్‌ అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. చిన్నకొల్లివలస ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ జంక్షన్‌ వద్ద గురువారం వాహనాలను తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు వ్యతిరేకంగా వాహనాల్లో మత్తుపదార్దాలు, మద్యం, నాటుసారా వంటివి తరలిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు వెంకటఅప్పలనాయుడు, మోజేశ్వరరావులు హెచ్చరించారు.

పాతపట్నం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద నిరంతరం వాహన తనిఖీలు చేసేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించినట్టు ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై్ౖసజ్‌ సి.ఐ. కోట కృష్ణారావు తెలిపారు. ముందుగా స్థానిక ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై్ౖౖసజ్‌ శాఖ కార్యాలయ పరిధిలోని పాతపట్నం, సారవకోట మండలాలలోని ఎనిమిది మద్యం షాపులను తనిఖీ చేశారు. రాష్ట్ర సరిహద్దు చెక్‌ పోస్టులను సందర్శించి.. సిబ్బంది పనితీరును పరిశీలించారు. అక్రమ మద్యం, డబ్బు రవా ణా కాకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

Updated Date - Oct 23 , 2026 | 12:03 AM