‘ఆర్నబ్’తో కూరగాయల రైతులు కుదేలు
ABN , Publish Date - Nov 01 , 2026 | 11:51 PM
మండలంలోని కూరగాయల రైతులు ఆర్నబ్ తుఫాన్ వల్ల కురిసిన వర్షాలకు కుదేలయ్యారు. ఎడతెరిపి లేకుండా కురి సిన వర్షాలకు కూరగాయల పంటలు నీటి పాలయ్యాయి. దీంతో నందిగాం, పెంటూ రు, బెజ్జిపల్లి, కాపుతెంబూరు, హరిదాసుపురం, నర్శిపురం, లఖిదాసుపురం, దిమ్మిడి జోల, నౌగాం, కల్లాడ తదితర గ్రామాల్లో సాగుచేసిన కేబేజీ, బరబటీ, బీర, ఉల్లి, తోట కూర తదితర పంటలు దెబ్బతినడంతో లబోదిబోమంటున్నారు ఆరుగాలం శ్రమిం చిన, పెట్టుబడి పెట్టిన రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టిమిట్టాడుతున్నారు. తక్షణమే అధికారులు నష్టాలను పరిశీలించి పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
నందిగాం, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): మండలంలోని కూరగాయల రైతులు ఆర్నబ్ తుఫాన్ వల్ల కురిసిన వర్షాలకు కుదేలయ్యారు. ఎడతెరిపి లేకుండా కురి సిన వర్షాలకు కూరగాయల పంటలు నీటి పాలయ్యాయి. దీంతో నందిగాం, పెంటూ రు, బెజ్జిపల్లి, కాపుతెంబూరు, హరిదాసుపురం, నర్శిపురం, లఖిదాసుపురం, దిమ్మిడి జోల, నౌగాం, కల్లాడ తదితర గ్రామాల్లో సాగుచేసిన కేబేజీ, బరబటీ, బీర, ఉల్లి, తోట కూర తదితర పంటలు దెబ్బతినడంతో లబోదిబోమంటున్నారు ఆరుగాలం శ్రమిం చిన, పెట్టుబడి పెట్టిన రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టిమిట్టాడుతున్నారు. తక్షణమే అధికారులు నష్టాలను పరిశీలించి పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
వరి పంటను వీడని వరద
మండలంలో తుఫాన్ వీడి మూడురోజులు కావస్తున్నా వరి పంటపై వరద ప్రభావం వీడకపోతుండడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో పలు గ్రామాల్లో వరిపంట నేలకొరిగిన విషయం విదితమే. మరికొన్ని గ్రామాల్లో చెరువు వరద పంట పొలాలపై ప్రవహిస్తుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరిచేనును కాపాడుకునేందుకు పాయలు తీయడం, బట్టిలు తవ్వడం తదితర పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు.
30 ఎకరాల్లో నీటమునిగిన ఉద్యాన పంటలు
పాతపట్నంరూరల్, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): మండలంలో ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాల వల్ల 30 ఎకరాల్లో ఉద్యానపంటలు నీట మునిగినట్లు ఉద్యానశాఖ అధికారి మంగమ్మ తెలిపారు. భారీ వర్షాల వల్ల మహేంద్రతనయలో నీటి ఉధృతి పెరగడంతోపాటు రొంపివలస గుమ్మిగెడ్డ పొంగడంతో మండలంలోని కొరసవాడ, కాగువాడ, రొంపివలస, రొమదల, రౌతులక్ష్మీపురం, గోపాలపురం తదితర ప్రాంతాల్లో గల వందల ఎకరాల వరిపంట పొలాలు నీట మునిగాయి.