వైభవంగా వాసుదేవుని రథోత్సవం
ABN , Publish Date - Feb 13 , 2026 | 11:29 PM
Mandasa Brahmotsavam మందస వాసుదేవ ఆలయంలో వారం రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఉదయం 9 గంటలకు అశేష భక్తజనావళి మధ్య స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది.
ముగిసిన మందస బ్రహ్మోత్సవాలు
హరిపురం, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): మందస వాసుదేవ ఆలయంలో వారం రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలు శుక్రవారం ముగిశాయి. ఉదయం 9 గంటలకు అశేష భక్తజనావళి మధ్య స్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఒడిశాతోపాటు విజయనగరం, విశాఖపట్నం వంటి సుదూర ప్రాంతాలనుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. సాయంత్రం ఆలయ సమీపంలోని గోపాలసాగరం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసి శ్రీదేవి, భూదేవి సమేత వాసుదేవ స్వామికి చక్రతీర్థం, అవబృదస్నానం కన్నుల పండువగా చేపట్టారు. అనంతరం ద్వాదశారాధన, శ్రీ పుష్పయోగం కార్యక్రమాలను నిర్వహించారు. చిన్నారులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.