ఉత్తరాంధ్ర గొంతుక ‘వంగపండు’
ABN , Publish Date - Aug 04 , 2026 | 11:35 PM
Grand tribute to People's Poet Prasad Rao వజ్రపుకొత్తూరు, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): ప్రజాకవి వంగపండు ప్రసాదరావు ఉత్తరాంధ్ర గొంతుక అని ప్రముఖ సినీనటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. మంగళవారం పల్లిసారధిలో ‘ఉత్తరాంధ్ర గొంతుక’ ఆధ్వర్యంలో వంగపండు సంస్మరణ సభ నిర్వహిం చారు.
దోపిడీ ఉన్నంత వరకు ఉద్యమాలు ఆపలేరు
ప్రముఖ సినీనటుడు ఆర్.నారాయణమూర్తి
ప్రజాకవి ప్రసాదరావుకు ఘనంగా నివాళి
వజ్రపుకొత్తూరు, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): వజ్రపుకొత్తూరు, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): ప్రజాకవి వంగపండు ప్రసాదరావు ఉత్తరాంధ్ర గొంతుక అని ప్రముఖ సినీనటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. మంగళవారం పల్లిసారధిలో ‘ఉత్తరాంధ్ర గొంతుక’ ఆధ్వర్యంలో వంగపండు సంస్మరణ సభ నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో నారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో దోపిడీ, అణచివేత ఉన్నంతవరకు ప్రజా ఉద్యమాలను ఎవరూ ఆపలేరన్నారు. మహాకవి శ్రీశ్రీ ప్రజాకవిగా కొనియాడారని గుర్తు చేశారు. దేశసంపద కొద్దిమంది కార్పొరేట్ సంస్థలకు కాకుండా పేదప్రజలకు చేరాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ కగార్ పేరుతో ఉద్యమాలను కేంద్రం అణచివేయాలని ప్రయత్నించినా ప్రజాఉద్యమాలు ఆగవన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల హక్కులను హరించే ప్రయత్నాలు జరిగితే వంగపండు రచించిన పోరాట గీతాలు మరిన్ని పుట్టుకొచ్చి చైతన్యపరుస్తాయన్నారు. ఈ సందర్భంగా ఆయన వంగపండుతో తనకు ఉన్న అనుబందాన్ని గుర్తు చేసుకుని ఆయన రచించిన పాటలను పాడారు. కార్యక్రమంలో ప్రజాగొంతుక అమ్మ రామక్రిష్ణతో పాటు జననాట్యమండలి నాయకులు సంజీవ్, వంగండు కుమారుడు దుష్యంత్, ప్రజాకళామండలి నాయకులు కోటి, బహుజన కళామండలి కార్యదర్శి ఉదయబాస్కర్, విరసం కార్యదర్శి ఎ.కృష్ణ, ప్రజాకళామండలి రాష్ట్ర నాయకులు రాజనరసింహ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు వంగపండు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.