వంశధార కాలువలు ఆధునికీకరించాలి
ABN , Publish Date - Feb 10 , 2026 | 11:32 PM
ww
నరసన్నపేట, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): వంశధార కాలువలు ఆధునికీకరించాలని, బొంతు ఎత్తిపోథల పథకం పూర్తిచేయా లని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడుకు పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం ఢిల్లీలో సీఎం నారా చంద్రబాబునాయుడును రమణమూర్తి సోమవారం రాత్రి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. చంద్రబాబునాయుడుతో నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించారు. కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త బగ్గు అర్చన పాల్గొన్నారు.