విలువలతో కూడిన విద్య అవసరం
ABN , Publish Date - Oct 15 , 2026 | 12:04 AM
బాలి కలకు విలువలతో కూడిన విద్య అవసరమని, అది లభించినప్పుడే వారు సమాజంలో బాధ్యత కలిగిన పౌరులుగా తయారవుతారని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు.
జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు
శ్రీకాకుళం లీగల్, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): బాలి కలకు విలువలతో కూడిన విద్య అవసరమని, అది లభించినప్పుడే వారు సమాజంలో బాధ్యత కలిగిన పౌరులుగా తయారవుతారని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. న్యాయ సేవా సదన్ సమావేశ మందిరంలో ఐసీడీఎస్, న్యాయ సేవాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యం లో అంతర్జాతీ య బాలికా దినోత్సవం బుధవారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య అంటే కేవలం పుస్తక పఠనమే కాదని, వినయం, విధేయత, మంచి వాక్కు, తగిన వస్త్రధారణ, మంచి నడవడిక కలిగి ఉండాలన్నారు. బాలికలు, మహి ళల హక్కుల పరిరక్షణకు తమ సంస్థ ద్వారా అవగాహన కలిగిస్తున్నామన్నారు. తల్లిదండ్రు ల్లో నమ్మకాన్ని కలిగిస్తే లక్ష్యాలను చేరుకోవాలన్నారు. అనంతరం అవగాహన పోస్టర్లను ఆవిష్కరించారు. కార్య క్రమంలో డీఈవో ఎ. రవిబాబు, ఐసీడీఎస్ పీడీ పి. శోభారాణి, విద్యా ఫౌండేషన్ ప్రతినిధి యు.ప్రసాద రావు, జిల్లా బాలల రక్షణ అధికారి కేవీ రమణ, డీఎం సీ డి.ఉమామహేశ్వర రావు, అడ్వకేట్ జి.ఇందిరా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.