విలువ ఆధారిత పరిశ్రమలే లక్ష్యం
ABN , Publish Date - Jul 11 , 2026 | 12:38 AM
పలాస నియోజకవర్గంలో జీడి ఉత్పత్తిని మూడు రెట్లు పెంచడంతో పాటు విలువ ఆధారిత, అనుబంధ పరిశ్రమల ఏర్పాటే లక్ష్యమని ఎమ్మెల్యే గౌతు శిరీష చెప్పారు.
ఎమ్మెల్యే గౌతు శిరీష
పలాస, జూలై 10 (ఆంధ్రజ్యోతి): పలాస నియోజకవర్గంలో జీడి ఉత్పత్తిని మూడు రెట్లు పెంచడంతో పాటు విలువ ఆధారిత, అనుబంధ పరిశ్రమల ఏర్పాటే లక్ష్యమని ఎమ్మెల్యే గౌతు శిరీష చెప్పారు. తన కార్యాలయంలో శుక్రవారం చర్చా కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో ఎమ్మెల్యే గౌతు శిరీష, టెక్కలి హార్టికల్చర్ అధికారి చంద్రశేఖర్, పలాస కాజ్యూ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లా శ్రీనివాసరావు, జీడి పరిశ్రమల యజమానులు, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీదారులు, ఎస్సార్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. జీడి సాగు విస్తరణ, దిగుబడి పెంపు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిశ్రల అభివృద్ధి తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. జీడి ఉత్పత్తిని గణనీయంగా పెంచడంతో పాటు మహారాష్ట్రలోని రత్నగిరి ప్రాంతం, కేరళ రాష్ట్రంలో జీడిసాగు, పరిశ్రమలపై ప్రత్యక్షంగా ఽఅధ్యయనం చేయాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో పరిశీ లించి...అక్కడి పద్ధతు లను ఇక్కడ అమలు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిరీష మాట్లాడుతూ ఉద్యోగాలు కావాలంటే పరిశ్రమలు రావా లన్నారు. ప్రభుత్వం, ప్రజలు, స్థానిక యువత అందరూ కలిసి పెట్టుబడు దారులకు అవసరమైన సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలాస తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త వెంకన్నచౌదరి, ఎస్సార్ కంపెనీ ప్రతినిధులు సాయక్ అప్పారావు, హృషికేశ్ పరంజిత్, అరుణ్ రంజన్, జీడి పరిశ్రమల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.