Share News

ఉత్తరాంధ్ర నాటిక పోటీలు ప్రారంభం

ABN , Publish Date - Apr 04 , 2026 | 12:16 AM

సమాజ చైతన్యా నికి నాటికలు ప్రతిబింబా లని వక్తలు అన్నారు. బొరివంక గ్రామంలో శుక్రవారం కళింగ సీమ కళాపీఠం ద్వితీయ కళాపరిషత్‌ సందర్భంగా ఉత్తరాంధ్ర నాటిక పోటీలు ప్రారం భమయ్యాయి.

ఉత్తరాంధ్ర నాటిక పోటీలు ప్రారంభం
నీళ్లు..నీళ్లు నాటికలో ఓ సన్నివేశం

కవిటి, ఏప్రిల్‌ 3 (ఆంధ్ర జ్యోతి): సమాజ చైతన్యా నికి నాటికలు ప్రతిబింబా లని వక్తలు అన్నారు. బొరివంక గ్రామంలో శుక్రవారం కళింగ సీమ కళాపీఠం ద్వితీయ కళాపరిషత్‌ సందర్భంగా ఉత్తరాంధ్ర నాటిక పోటీలు ప్రారం భమయ్యాయి. ఈ సందర్భంగా నటరాజ నాట్యమండలి ఆధ్వర్యంలో కళాకారులు జానపద నృత్య ప్రదర్శన చేపట్టారు. అనం తరం విశాఖపట్నం తెలుగు కళాసమితి ఆధ్వర్యంలో ‘చిటికెన వేలు’ నాటిక, అట్టాడ అప్పల నాయుడు రచించిన ఈ నాటికలో కుటుంబ బంధాలు, రైతుల జీవితం, సమాజంలో ఎదు రయ్యే కష్టాలు, అన్యాయాలు హృదయానికి హత్తుకునేలా కళాకారులు ప్రదర్శించారు. అలాగే పెందుర్తికి చెందిన శ్రీనటరాజ్‌ డ్రమటిక్‌ అసోసి యేషన్‌ కళాకారులు ‘నీళ్లు..నీళ్లు’ నాటిక ప్రేక్షకులను ఆలోచింపజేసింది. గ్రామీణ ప్రాంత నేపథ్యంలో నీటి ప్రాముఖ్యత, వర్షాభావం, రైతు కష్టా లు ప్రధానాంశంగా ఈ నాటికను ప్రదర్శించారు. భూగర్భ జలాలు తగ్గు దలతో రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను కళాత్మకంగా ప్రదర్శించి ఆకట్టుకున్నారు. నీటి విలువ తెలియక వృథా చేస్తున్న మనుషుల నిర్లక్ష్యా న్ని ఈ నాటికలో కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. ఈ నాటికకు మూలకథ ను చందు తులసి అందించగా రావి నాగేశ్వరరావు రచించారు. కార్యక్ర మంలో కూటమి నేతలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2026 | 12:16 AM