Share News

నిరుపయోగంగా చెత్త సేకరణ రిక్షాలు

ABN , Publish Date - May 19 , 2026 | 11:58 PM

మెళియాపుట్టిలో చెత్త సేకరణ రిక్షాలు తప్పుపడుతున్నాయి. ప్రభుత్వం పంచాయతీల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. దీనిలో భాగంగా ప్రతి గ్రామంలో స్వచ్ఛాంద్ర కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈనేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్‌ కళ్యాణ్‌ పంచాయతీల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.

నిరుపయోగంగా చెత్త సేకరణ రిక్షాలు
మండలపరిషత్‌ కార్యాలయం ఎదుట ఉన్న చెత్తసేకరణ రిక్షాలు:

మెళియాపుట్టి, మే 19 (ఆంధ్రజ్యోతి): మెళియాపుట్టిలో చెత్త సేకరణ రిక్షాలు తప్పుపడుతున్నాయి. ప్రభుత్వం పంచాయతీల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. దీనిలో భాగంగా ప్రతి గ్రామంలో స్వచ్ఛాంద్ర కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈనేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్‌ కళ్యాణ్‌ పంచాయతీల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనిలో భాగంగా పంచాయతీల్లో చెత్తసేకరణకు పంచాయతీకి రెండు రిక్షాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకొన్నారు. ఈ నేపథ్యంలో మెళియాపుట్టి నెలరోజుల కిందట ఈ రిక్షాలు చేరినా పంపిణీకి నోచుకోకపోవంతో నిరుపయోగంగా మారాయి.

Updated Date - May 19 , 2026 | 11:58 PM