నిర్వహణ లేక నిరుపయోగం
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:07 AM
మండలం లోని గొల్లవూరులో అభయ్ ఫౌండేషన్ సామాజిక సేవా సంస్థ రూ.15 లక్షలతో నిర్మించిన సామూహిక మరుగుదొడ్లు నిర్వహణకు లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. వీటి వినియోగానికి ఆసక్తి కనబరచడం లేదు. ఇక్కడ వారంతా ఆరుబయటే మలవిసర్జన చేస్తున్నారు.
సోంపేట రూరల్, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): మండలం లోని గొల్లవూరులో అభయ్ ఫౌండేషన్ సామాజిక సేవా సంస్థ రూ.15 లక్షలతో నిర్మించిన సామూహిక మరుగుదొడ్లు నిర్వహణకు లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. వీటి వినియోగానికి ఆసక్తి కనబరచడం లేదు. ఇక్కడ వారంతా ఆరుబయటే మలవిసర్జన చేస్తున్నారు.
గొల్లవూరులో చెంబు పట్టుకొని బహిర్భూమికి వెళ్లే అలవాటును నివా రించేందుకు అభయ్ ఫౌండేషన్ సామాజిక సేవా సంస్థ రూ.15లక్షల తో గ్రామ శివారులో మరుగుదొడ్లు నిర్మించింది. స్వచ్ఛభారత్ మిషన్ కింద అభయ్ ఫౌండేషన్ ఉచితంగా మరుగుదొడ్లు నిర్మించినా కొన్ని కండ్ర కుటుంబాలు వాటిని వినియోగించడంలేదు. గొల్లవూరులో 125కండ్ర కు టుంబాలు నివసిస్తున్నాయి. కాలనీలో ఈ కుటుంబాలకు మూడేళ్ల కిందటే మరుగుదొడ్లు నిర్మించి అభయ్ ఫౌండేషన్ నీటి సదుపాయం కల్పించింది. నిర్వహణ బాధ్యతలు సంస్థ వారికే అప్పగించింది. కొన్నాళ్లు తర్వాత సెప్టిక్ ట్యాంకులు నిండి నీటి సమస్య తలెత్తింది. అప్పటి నుంచి వాటిని వినియో గించకుండా వదిలేశారు. మరుగుదొడ్లు వినియోగంలోకి తీసుకురావాలని వారికి ఎన్నిసార్లు అవగాహనకల్పించినా వినడంలేదని, ఆరుబయటకు వెళ్ల వద్దని హెచ్చరిస్తున్నా మార్పు రావడం లేదని మాజీ సర్పంచ్ ఈశ్వరరావు తెలిపారు. కాగా అభయ్ ఫౌండేషన్ మరుగుదొడ్లు నిర్మించి ఇవ డం శుభ పరిణామమని ఎంపీడీవో ఈశ్వరమ్మ తెలిపారు. నిర్వహణ బాధ్యతలు గ్రామస్థులు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. మహిళలు చెంబులు పట్టుకొ ని ఆరుబయటబహిర్భూమికి వెళ్లడం ఈ రోజుల్లో ఎక్కడా లేదని తెలిపారు.