Share News

నిర్వహణ లేక నిరుపయోగం

ABN , Publish Date - Aug 09 , 2026 | 12:09 AM

జలుమూరులోని ప్రయాణికుల విశ్రాంతి భవనం నిర్వహణ లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. 15 ఏళ్ల కిందట ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకోసం ఇక్కడ భవనం నిర్మించారు.

 నిర్వహణ లేక నిరుపయోగం
మాట్లాడుతున్న మామిడి మాధవరావు:

జలుమూరు, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): జలుమూరులోని ప్రయాణికుల విశ్రాంతి భవనం నిర్వహణ లేకపోవడంతో నిరుపయోగంగా మారింది. 15 ఏళ్ల కిందట ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకోసం ఇక్కడ భవనం నిర్మించారు. అయితే ప్రయాణికులకు అందుబాటులో లేని ప్రాంతంలో ఈ భవనం నిర్మించడంతో అక్కడ ఆర్టీసీ బస్సులు నిలుపుదల చేయకపోవడం వల్ల వృథాగా మారింది. పూర్తిగా వినియోగం లేకపోవడంతో మరమ్మతులకు నోచుకోకపోవడంతో భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఈ నేపథ్యంలో జలుమూరు నుంచి వివిద ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు రోడ్డుపైనే బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి విశ్రాంతి భవనం నిర్మించి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Aug 09 , 2026 | 12:09 AM