సేంద్రియ ఎరువులు వాడాలి
ABN , Publish Date - May 29 , 2026 | 11:44 PM
సేంద్రియ ఎరువులను వాడడం ద్వారా భూసారం పెరగడమే కాకుండా తెగుళ్లు వ్యాప్తిచెందే అవకాశం తక్కువగా ఉంటుందని జిల్లా వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆర్.శ్రీనివాసరావు తెలిపారు.
జిల్లా వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు
నరసన్నపేట, మే 29(ఆంధ్రజ్యోతి): సేంద్రియ ఎరువులను వాడడం ద్వారా భూసారం పెరగడమే కాకుండా తెగుళ్లు వ్యాప్తిచెందే అవకాశం తక్కువగా ఉంటుందని జిల్లా వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆర్.శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం కంబకాయలో జిల్లా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో సమగ్ర ఎరువుల యాజమాన్యంపై శిక్షణ నిర్వహించారు. యూరియా అధిక మోతాదులో వాడకం వల్ల కలిగే అనర్ధాలను వివరించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పోగోటి ఉమామహేశ్వరి, సీహెచ్ వెంకట్రావు, ఏడీఏ వెంకటమధు, ఎఫ్‌టీసీ వై.సురేష్, ఏవో వై.సూర్యకుమారి పాల్గొన్నారు.