Share News

పోస్టల్‌ బ్యాలెట్ల వినియోగం

ABN , Publish Date - Nov 30 , 2026 | 12:13 AM

జలుమూరు మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు కేంద్రంలో ఆదివారం ఎన్నికల సిబ్బంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

పోస్టల్‌ బ్యాలెట్ల వినియోగం

జలుమూరు, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): జలుమూరు మండల పరిషత్‌ కార్యాలయంలో ఏర్పాటుచేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు కేంద్రంలో ఆదివారం ఎన్నికల సిబ్బంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బందికి ఎన్నికల కమిషన్‌ పోస్టల్‌ బ్యాలెట్‌విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మూడో విడతలో జరిగే ఎన్నికల పోలింగ్‌ విధులు నిర్వర్తించే సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోడానికి ఈనెల నుంచి సోమవారం వరకూ ఎన్నికల కమిషన్‌ అవకాశం కల్పించింది.

నేటిలోగా పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోవాలి

టెక్కలి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): మండలంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎన్నికలవిధులు నిర్వహిస్తున్న సిబ్బం ది సోమవారంలోగా పోస్టల్‌బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో ఎం.రేణుకాదేవి ఒక ప్రకటనలో కోరారు. ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బంది, ఉద్యోగులు ఓటుహక్కును వినియోగించుకు నేందుకు పోస్టల్‌బ్యాలెట్‌ను వినియోగించుకోవాలని సూచించారు.

Updated Date - Nov 30 , 2026 | 12:13 AM