Share News

గ్రంఽథాలయాలను వినియోగించుకోండి

ABN , Publish Date - May 18 , 2026 | 11:27 PM

శాఖా గ్రంఽథాలయాలను విద్యార్థులు వినియో గించుకోవాలని జిల్లా గ్రంఽథాలయ సంస్థ కార్యదర్శి వీవీజీఎస్‌ శంకరరావు కోరారు.

 గ్రంఽథాలయాలను వినియోగించుకోండి
నందిగాం: గ్రంఽథాలయంలో క్విజ్‌ పోటీలను పర్యవేక్షిస్తున్న శంకరరావు:

నందిగాం, మే 18(ఆంధ్రజ్యోతి): శాఖా గ్రంఽథాలయాలను విద్యార్థులు వినియో గించుకోవాలని జిల్లా గ్రంఽథాలయ సంస్థ కార్యదర్శి వీవీజీఎస్‌ శంకరరావు కోరారు. సోమవారం స్థానిక శాఖాగ్రంఽథాలయాన్ని సందర్శించారు. ఈసందర్భంగా విద్యా ర్థులకు నిర్వహిస్తున్న క్విజ్‌పోటీలు పర్యవేక్షించారు. వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా గ్రంఽథాలయంలో పలు కార్యక్రమాలు అమలు చేస్తుండడంతో వినియోగించుకోవాలని సూచించారు. ఆయనతోపాటు గ్రంఽథాలయాధికారి ఎస్‌.ఉదయ్‌కిరణ్‌ ఉన్నారు.

ఫపాతపట్నం, మే 18(ఆంధ్రజ్యోతి): స్థానిక శాఖాగ్రంఽథాలయంలో చిన్నారులు కోలాట ప్రదర్శనలతో సందడి చేశారు. వేసవి శిక్షణ శిబిరంలో భాగంగా శాఖాగ్రంఽథాలయాధికారి డి.సాయమ్మ ఆధ్వర్యంలో కోలాటంపై శిక్షణనిచ్చారు.

ఫ మెళియాపుట్టి, మే 18(ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ యోగాను అలవరచుకోవాలని గ్రంఽథాలయ అధికారి అనూరాధ తెలిపారు. సోమవారం మెళియాపుట్టిలో వేసవి శిక్షణలో భాగంగా యోగాపైౖ శిక్షణ నిర్వహించారు. ఈసందర్భంగా ఆమెమాట్లాడుతూ చిన్నప్పటినుండే యోగాను అలవాటు చేసుకొంటే ఆరోగ్యకరంగా ఉంటారని తెలిపారు.

Updated Date - May 18 , 2026 | 11:27 PM