న్యాయ సేవలు వినియోగించుకోండి
ABN , Publish Date - Feb 25 , 2026 | 12:10 AM
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అంది స్తున్న ఉచిత న్యాయ సేవలను పేద ఖైదీలు వినియోగించుకోవాలని ఆ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయాధికారి కె.హరిబాబు అన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు
నరసన్నపేట, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అంది స్తున్న ఉచిత న్యాయ సేవలను పేద ఖైదీలు వినియోగించుకోవాలని ఆ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయాధికారి కె.హరిబాబు అన్నారు. మంగళవారం నరసన్నపేట సబ్‌జైలును ఆయన తనిఖీ చేశారు. ఈ సంద ర్భంగా నింధితులతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సబ్‌జైలులో అందిస్తున్న భోజన సదుపాయాలపై ఆరా తీశారు. వచ్చే నెల 14న నిర్వహించనున్న జాతీయ లోక్‌అదాలత్‌ను ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈయన వెంట సబ్‌జైలు సిబ్బంది ఉన్నారు.
పాతపట్నం, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): ఉచిత న్యాయసేవలను వినియో గించుకోవాలని లీగల్ సర్వీసెస్ అథారిటీ జిల్లా కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. పాతపట్నం సబ్‌జైలును మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఖైదీలతో మాట్లాడుతూ ఎవరికైనా న్యాయవాది లేకపోతే ప్రభుత్వమే న్యాయవా దిని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. సబ్‌జైలు సిబ్బంది ఉన్నారు.