అవసరం మేరకు యూరియా నిల్వలు
ABN , Publish Date - Jul 13 , 2026 | 11:37 PM
రైతుల అవసరాల మేరకు యూరియా నిల్వలు న్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవ సరం లేదని జిల్లా వ్యవసాయాధికారి వైవీ మురళీకృష్ణ అన్నారు.
జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ
ఆమదాలవలస, జూలై 13 (ఆంధ్రజ్యోతి): రైతుల అవసరాల మేరకు యూరియా నిల్వలు న్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవ సరం లేదని జిల్లా వ్యవసాయాధికారి వైవీ మురళీకృష్ణ అన్నారు. సోమవారం దూసి ఆర్ ఎస్‌కేలో యూరియా పంపిణీ ప్రక్రియను పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ఎటువంటి కొరత లేదన్నారు. ప్రభుత్వం అవసరమైన మేరకు ఎరువులను అందుబాటులో ఉంచిందని పేర్కొ న్నారు. రైతులు ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం ఎరువులను వినియో గించి పంట దిగుబడిని పెంచుకో వాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి మెట్ట మోహన్‌రావు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.