Share News

యూరియా వినియోగం తగ్గించాలి: ఏడీఏ

ABN , Publish Date - Mar 05 , 2026 | 11:39 PM

: తెగుళ్ల నుంచి పంటలను రక్షించుకొనేందుకు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని సోంపేట వ్యవసాయ సహాయ సంచాలకుడు భవానీ ప్రసాద్‌ రైతులకు సూచించారు.

యూరియా వినియోగం తగ్గించాలి: ఏడీఏ
వరిపైరును పరిశీలిస్తున్న వ్యవసాయశాఖ అధికారులు

సోంపేట రూరల్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): తెగుళ్ల నుంచి పంటలను రక్షించుకొనేందుకు సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని సోంపేట వ్యవసాయ సహాయ సంచాలకుడు భవానీ ప్రసాద్‌ రైతులకు సూచించారు. యూరియా వాడకం తగ్గించాలని కోరారు. గురువారం బేసి రామచంద్రపురంలో పొలం పిలుస్తోంది కార్య క్రమంలో భాగంగా వరిపంటను ఏవో బి.నరసింహమూ ర్తితో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో వ్యవసాయ సహాయకులు ధనలక్ష్మి, రైతులు కీల కృష్ణారావు పాల్గొన్నారు.

Updated Date - Mar 05 , 2026 | 11:39 PM