వడదెబ్బతో ఉపాధి వేతనదారుడు మృతి
ABN , Publish Date - Apr 26 , 2026 | 12:08 AM
పెద్దకొల్లివలస పంచాయతీ స్కాట్‌పేట గ్రామానికి చెందిన ఉపాధి వేత నదారు యాదవరెడ్డి జగన్నాథం(65) శనివారం వడదెబ్బకు గురై మృతి చెందాడు.
ఎల్‌ఎన్ పేట, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): పెద్దకొల్లివలస పంచాయతీ స్కాట్‌పేట గ్రామానికి చెందిన ఉపాధి వేత నదారు యాదవరెడ్డి జగన్నాథం(65) శనివారం వడదెబ్బకు గురై మృతి చెందాడు. తోటి ఉపాధి వేతనదారులు తెలిపిన వివరాల మేరకు.. జగన్నాథం గ్రామ సమీపం లోని మంచినీటి కోనేరు వద్ద జరుగుతున్న ఉపాధి పను లకు శనివారం వెళ్లాడు. పనులు చేస్తుండగా అసటగా ఉందంటూ కూర్చొన్న చోటే పడిపోయాడు. వెంటనే 108 వాహనానికి సమాచారం ఇవ్వగా.. సిబ్బంది ఘటనా స్థలా నికి చేరుకుని జగన్నాథంను పరిశీలించగా అప్పటికే చనిపోయినట్టు నిర్ధారిం చారు. విషయం తెలుసుకున్న ఏపీవో వి.శ్రీదేవి వెంటనే ఘటనా స్దలానికి చేరు కొని వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. కాగా జగన్నాథం భార్య గతంలోనే చనిపోగా కొడుకు వెంకటరమణ ఉన్నాడు.
ద్విచక్ర వాహనం ఢీ.. వృద్ధుడికి తీవ్ర గాయాలు
శ్రీకాకుళం రూరల్, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): ద్విచక్ర వాహనం ఢీకొని వృద్ధు డికి తీవ్ర గాయాలైన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కళ్లేపల్లి పంచాయతీ బోరపేటకి చెందిన బోర సింహా చలం శుక్రవారం నడుచుకుంటూ బోరపేట కాలనీ వైపు వెళ్తుండగా.. అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వస్తూ ఢీకొన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సింహాచలాన్ని స్థానికులు పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తలకి వెనుక భాగంలో రక్తస్రావం, రెండు కాళ్లు రోడ్డుకు రాపిడి జరిగి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఎస్‌ఐ రాము తెలిపారు.