‘సిక్కోలు వాడుక నుడులు’ గ్రంథావిష్కరణ
ABN , Publish Date - Nov 18 , 2026 | 12:20 AM
రిటైర్డ్ తెలుగు అధ్యాప కుడు సనపల నారాయణమూర్తి రచించిన ‘సిక్కోలు వాడుక నుడులు గ్రంథాన్ని మంగళవారం ఆవిష్కరించారు.
శ్రీకాకుళం కల్చరల్, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): రిటైర్డ్ తెలుగు అధ్యాప కుడు సనపల నారాయణమూర్తి రచించిన ‘సిక్కోలు వాడుక నుడులు గ్రంథాన్ని మంగళవారం ఆవిష్కరించారు. నగరం లోని ఉపనిషన్మందిరం వజ్రోత్సవాలను పురస్క రించుకొని పాలకొండరోడ్డులో ఉన్న కోదండ రామాలయంలో ఈ గ్రంథాన్ని డా.కె.అమ్మన్నా యుడు ఆవిష్కరించారు. ఈ గ్రంథాన్ని సాహితీ వేత్త బంకుపల్లె రమేష్‌శర్మ పరిచయం చేశారు. మందిరం అధ్యక్షుడు గమ్మా నగేష్ రచయితను సత్కరించారు. కార్యక్రమంలో జంధ్యాల శరత్ బాబు, భమిడిపాటి గౌరీశంకర్, బలివాడ మల్లేశ్వ రరావు, ఎల్.రామలింగస్వామి, పైడిహరనాథరావు, డా.పి.శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.