‘కనీస వేతనాల కోసం ఐక్య పోరాటం’
ABN , Publish Date - Jul 02 , 2026 | 11:44 PM
వివిధ పరి శ్రమల కార్మికులు, అంగన్ వాడీ, ఆశా, వీవోఏ, మధ్యా హ్న భోజనం కార్మికులు, స్కీం వర్కర్లు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం లేక ఇబ్బం దులు పడుతున్నారని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, శ్రామిక మహిళా కన్వీనర్ కె.నాగమణి అన్నారు.
అరసవల్లి, జూలై 2 (ఆంధ్రజ్యోతి): వివిధ పరి శ్రమల కార్మికులు, అంగన్ వాడీ, ఆశా, వీవోఏ, మధ్యా హ్న భోజనం కార్మికులు, స్కీం వర్కర్లు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం లేక ఇబ్బం దులు పడుతున్నారని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు సీహెచ్ అమ్మన్నాయుడు, శ్రామిక మహిళా కన్వీనర్ కె.నాగమణి అన్నారు. స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో సీఐటీయూ విస్తృత స్థాయి సమావేశం గురువారం నిర్వహించారు. గత 18 ఏళ్లుగా ప్రభుత్వం కనీస వేతన సవరణ చేయలేదని, దీంతో 50 లక్షల మంది తీవ్రంగా నష్టపోయారన్నారు. రూ.26 వేలు ఇవ్వాలని, ఈ దిశగా ఐక్యపోరాటం చేయాల్సిన అవసరం ఉంద ని సమస్యల పరిష్కారం కోసం ఈనెల 10న అంగన్‌వాడీల చలో కలెక్టరేట్ నిర్వహిస్తున్నా మన్నారు. కార్యక్రమంలో నాయకులు అల్లు సత్య నారాయణ, ఎం.ఆదినారాయణమూర్తి, ఎన్. గణపతి, ఎన్‌వీరమణ తదితరులు పాల్గొన్నారు.