Share News

విద్యార్థుల సమస్యలపై ఐక్య ఉద్యమాలు

ABN , Publish Date - Sep 29 , 2026 | 11:56 PM

విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్మలపై ఐక్యపోరాటాలు చేపడతామని ఎస్‌ఎఫ్‌ఐ ఆలిండియా అధ్యక్షుడు ఎం. సాజీ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలు పరిష్కరించాలని స్కూల్‌ బచావో ఉద్యమాన్ని బలోపేతం చేస్తామన్నారు.

విద్యార్థుల సమస్యలపై ఐక్య ఉద్యమాలు
భగత్‌సింగ్‌ చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ ఆలిండియా ప్రతినిధులు

ఎస్‌ఎఫ్‌ఐ ఆలిండియా అధ్యక్షుడు ఆదర్శ్‌ ఎం.సాజీ

శ్రీకాకుళం ఎడ్యుకేషన్‌, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్మలపై ఐక్యపోరాటాలు చేపడతామని ఎస్‌ఎఫ్‌ఐ ఆలిండియా అధ్యక్షుడు ఎం. సాజీ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న మౌలిక సదుపాయాల సమస్యలు పరిష్కరించాలని స్కూల్‌ బచావో ఉద్యమాన్ని బలోపేతం చేస్తామన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో సప్తగిరి ఫంక్షన్‌ హాల్‌లో సెమినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ భవిష్యత్‌ను నిర్మించడంలో యువత, విద్యార్థులు పాత్ర కీలకమన్నారు. భగత్‌సింగ్‌ తన చివరి రోజుల్లో కూడా పుస్తకాలు చదివి సమాజం కోసం ఆలోచిస్తూ తన జీవితాన్ని దేశ ప్రజలకు అంకితం చేశారన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థి సమస్యలపై పోరాటం చేయాలన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహన్‌ మాట్లా డుతూ.. విద్యార్థి సమస్యలపై మరిన్ని పోరాటాలు చేయాన్నారు. ఢిల్లీ జంతర్‌మంతర్‌ తరహాలో శ్రీకాకుళంలో విద్యార్థుల సమస్యలపై ఉద్యమాలు చేపడతామన్నారు. టెక్కలి మండలం రావివలస సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో ఇంటర్‌ విద్యార్థులు మృతి చెందిన ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. బాధిత కుటంబాలను ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. అంతకు ముందు భగత్‌ సింగ్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు డి.చందు, జిల్లా కార్యదర్శి పి.ఖగేష్‌, గర్స్ల్‌ ప్రతినిధి పి.దివ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2026 | 11:56 PM