Share News

విద్యార్థుల పోరాట ఫలితమే కేంద్రమంత్రి రాజీనామా

ABN , Publish Date - Jul 26 , 2026 | 12:19 AM

నీట్‌ పరీక్షలకు అక్రమాలపై ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద విద్యార్థులు చేపట్టిన పోరాట ఫలితమే కేంద్ర విద్యాశాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా అని డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు అన్నారు.

విద్యార్థుల పోరాట ఫలితమే కేంద్రమంత్రి రాజీనామా
విజయోత్సవ సంబరం నిర్వహిస్తున్న కాంగ్రెస్‌ నేతలు

డీసీసీ అధ్యక్షుడు అన్నాజీరావు

నగరంలో విజయోత్సవ ర్యాలీ

అరసవల్లి, జూలై 25(ఆంధ్రజ్యోతి): నీట్‌ పరీక్షలకు అక్రమాలపై ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద విద్యార్థులు చేపట్టిన పోరాట ఫలితమే కేంద్ర విద్యాశాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా అని డీసీసీ అధ్యక్షుడు సనపల అన్నాజీరావు అన్నారు. ఈ మేరకు శనివారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో విజయో త్సవం నిర్వహించారు. ర్యాలీ నిర్వహించి మిఠాయిలు పంచి, బెలూన్లు ఎగరవేసి సంబరాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా ర్థుల పోరాటానికి ఫలితం దక్కిందన్నారు. కార్యక్రమంలో నేతలు కేవీఎల్‌ఎస్‌ ఈశ్వరి, అంబటి కృష్ణారావు, ఇజ్జురోతు రమణ తదితరులు పాల్గొన్నారు.

‘నిరంతర పోరాటాల ఫలితమే..’

అరసవల్లి, జూలై 25(ఆంధ్రజ్యోతి): గత నెలరోజులుగా యువజన, ప్రజాసంఘాలు దేశవ్యాప్తంగా నిర్వహించిన పోరాటాల ఫలితమే కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా అని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు డి.చందు అన్నారు. ఈ మేరకు నగరంలోని సూర్యమహల్‌ జంక్షన్‌ వద్ద ఉన్న స్వామి వివేకానంద విగ్రహం వద్ద శనివారం రాత్రి విజయోత్సవం నిర్వహించారు. విద్యా వ్యవస్థను దెబ్బతీసే ఎన్డీఏ విధానాలను పూర్తిగా ఉపసంహరించుకునే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్‌ డీఈవో కె.అప్పారావు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు హేమంత్‌, మురళీ, జగన్‌, దివాకర్‌, కార్తీక్‌, అజిత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 26 , 2026 | 12:19 AM