Share News

కేంద్రమంత్రి రామ్మోహన్‌కి వింత అనుభవం

ABN , Publish Date - Apr 28 , 2026 | 11:55 PM

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడికి మంగ ళవారం వింత అనుభవం ఎదురైంది.

  కేంద్రమంత్రి రామ్మోహన్‌కి వింత అనుభవం
ఒడిశాకు చెందిన టాక్సీలో వెళుతున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు

అరసవల్లి ఉత్సవాల్లో చిక్కుకున్న కాన్వాయ్‌

ఒడిశా టాక్సీలో పర్యటన పూర్తి

రూ.500 అద్దెను చెల్లించిన వైనం

అరసవల్లి, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడికి మంగ ళవారం వింత అనుభవం ఎదురైంది. అరసవల్లి అసిరితల్లి అమ్మ వారి సిరిమానో త్సవాల్లో పాల్గొనేందుకు ఆయన ప్రయాణి స్తున్న కాన్వాయ్‌ ఉత్సవ రద్దీలో భక్తుల మధ్య చిక్కుకు పోయింది. దీంతో వై ప్లస్‌ భద్రత కలిగిన రామ్మోహన్‌ సెక్యూరిటీ ప్రొటోకాల్‌ నిబం ధనలను పక్కనపెట్టి అప్పుడే ఒడిశా నుంచి భక్తు లతో వచ్చి ఉన్న టాక్సీ ఎక్కి తన పర్యటన పూర్తి చేసుకున్నారు. ఐదు నిమిషాల ప్రయాణానికి ఆయన టాక్సీ డ్రైవర్‌కు రూ.500 అద్దెను చెల్లించ డం కొసమెరుపు. ఉత్సవాల్లో కాలినడకన, అందు బాటులో ఉన్న ప్రైవేటు వాహనాల్లో పాల్గొన్నా రు. ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి అరసవల్లి గ్రామంలో పలువురు ఇళ్లకు వెళ్లి ఉత్సవ శుభా కాంక్షలు తెలిపారు. కాగా గడచిన రెండు రోజు లుగా విశాఖ పర్యటనలో ఉన్న ఆయన అరస విల్లి ఉత్సవాల్లో పాల్గొనేందుకు నేరుగా విశాఖ పట్నం నుంచి అరసవల్లికి చేరుకున్నారు.

Updated Date - Apr 28 , 2026 | 11:55 PM