కేంద్రమంత్రి ప్రజాదర్బార్
ABN , Publish Date - May 17 , 2026 | 11:37 PM
నగరంలోని టీడీపీ జిల్లా కార్యాల యంలో ఆదివారం ప్రజాదర్బార్ నిర్వహించారు. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొని నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజల నుంచి 170 వినతులను స్వీకరించారు.
170 వినతులు స్వీకరించిన రామ్మోహన్ నాయుడు
అరసవల్లి, మే 17(ఆంధ్రజ్యోతి): నగరంలోని టీడీపీ జిల్లా కార్యాల యంలో ఆదివారం ప్రజాదర్బార్ నిర్వహించారు. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొని నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రజల నుంచి 170 వినతులను స్వీకరించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు సమస్యలపై వినతిపత్రాలను స్వీకరిం చారు. అవకాశం ఉన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కారాన్ని చర్యలు చేపట్టారు.
‘తెలుగు భాషను బతికిద్దాం’
తెలుగు భాషను బతికిద్దామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో జూన్ 6, 7 తేదీల్లో నిర్వహించను న్న 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల పోస్టర్‌ను ఆదివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగు భాష కు మంచి గుర్తింపు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో కళా వేదిక అధ్యక్షుడు ఉమామహేష్, అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్, ఈశ్వరి భూషణం, పార్థసారథి, ఎం.నాగేశ్వరరావు, ఉపేంద్రశర్మ, ఐఎన్ డీప్రసాద్, దుర్గాప్రసాద్ శర్మ, పల్లె తేజలక్ష్మి, నీరజా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
‘బీచ్‌లను పర్యాటక కేంద్రాలుగా మార్చండి’
సోంపేట రూరల్, మే 17 (ఆంధ్రజ్యోతి): ఎర్రముక్కాం, ఎకువూరు బీచ్‌లను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని టీడీపీ రాష్ట్ర కార్య దర్శి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు సూరాడ చంద్రమోహన్ కోరారు. ఈ మేరకు ఆదివారం శ్రీకాకుళంలో కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును కలిసి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు మడ్డుకుమార్, బడే తమ్మారావు పాల్గొన్నారు.
‘పోర్ట్‌బ్లెయిర్ నుంచి విశాఖకు విమానం వేయాలి’
అండమాన్ పోర్ట్ బెయిర్ నుంచి విశాఖపట్నం వరకు డైరెక్ట్‌గా విమా న సర్వీస్‌ను నడపాలని అండమాన్ దీవులు జాయింట్ యాక్షన్ తెలుగు కమ్యూనిటీ ప్రధాన కార్యదర్శి బైపల్లి హేమరాజు కోరారు. ఈ మేరకు ఆదివారం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడును శ్రీకాకుళంలో కలిసి వినతిపత్రం అందించారు. తెలుగు వారి సమస్యలపై పోరాటం చేసి పోలీసు కేసుల్లో ఇరుక్కున్న నాయకులను విడిపించాలన్నారు. కార్యక్ర మంలో బడే తమ్మారావు, అండమాన్ నికోబార్ టీడీపీ సెక్రటరీ వంక మోహన్‌రావు ఉన్నారు.
కేంద్రమంత్రిని క లిసిన రెవెన్యూ సంఘ నాయకులు
అరసవల్లి, మే 17(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసుల సంఘం జిల్లా నూతన కమిటీ ప్రతినిధులు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావులను ఆదివారం శ్రీకాకుళంలోని కేంద్రమంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రెవెన్యూ ఉద్యోగులపై మిగతా పనుల ఒత్తిడి తగ్గించేలా చర్యలు తీసుకునేలా కృషి చేయాలని సంఘ నేతలు కోరారు. మంత్రిని కలిసిన వారిలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు భైరి వీవీఎన్ రాజు, కార్యదర్శి సోనీకిరణ్, సభ్యులు అరుణ కుమార్, జీకే శ్రీనివాసరావు, దుంగ పద్మావతి, కె.రాధిక, గౌరీశంకర్, డి.ప్రకాశరావు, డి.రాజేష్ తదితరులు పాల్గొన్నారు.