Share News

గుర్తుతెలియని మహిళ మృతి

ABN , Publish Date - Jan 22 , 2026 | 12:19 AM

శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వే స్టేషన్‌ సమీపం వెంగళ రావు కాలనీ వద్ద బుధ వారం రైల్వేట్రాక్‌పై గు ర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించినట్టు జీఆర్పీ ఎస్‌ఐ ఎం.మధుసూ దనరావు తెలిపారు.

గుర్తుతెలియని మహిళ మృతి

ఆమదాలవలస, జనవరి 21(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వే స్టేషన్‌ సమీపం వెంగళ రావు కాలనీ వద్ద బుధ వారం రైల్వేట్రాక్‌పై గు ర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించినట్టు జీఆర్పీ ఎస్‌ఐ ఎం.మధుసూ దనరావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. సుమారు 50 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని మహిళ రైలు ప్రమాదంలో మృతి చెందిందన్నారు. మృతురాలు పసుపు రంగుచీర ధరించి ఉందన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌ ఆసుపత్రికి తరలించా మన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరికైనా ఈమె వివ రాలు తెలిస్తే 9247585744 ఫోన్‌ నెంబరులో సంప్రదించాలని ఎస్‌ఐ తెలిపారు.

పలాస రైల్వే టిక్కెట్‌ కౌంటరు వద్ద వృద్ధుడు..

పలాసరూరల్‌, జనవరి 21(ఆంధ్రజ్యోతి): పలాస రైల్వేస్టేషన్‌ టిక్కెట్‌ కౌంటరు వద్ద గుర్తుతెలి యని వ్యక్తి మృతిచెందాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మే రకు.. మృతుడు 60 నుంచి 70 ఏళ్లలోపు వయస్సు ఉంటుందని, బ్లూ రంగు కలిగిన స్వెట్టర్‌ ధరించి ఉన్నాడు. ఇతర ఎటువంటి ఆధారా లు లేకపోవడంతో పూర్తిస్థాయిలో సమాచా రం లభించలేదు. ఎవరికైనా తెలిస్తే పలాస జీఆర్‌పీ పోలీసు స్టేషన్‌లో సంప్రదించాలని జీఆర్‌పీ పోలీసులు కోరారు. మృతదేహాన్ని పలాస సీహెచ్‌సీకి తరలించి కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

Updated Date - Jan 22 , 2026 | 12:19 AM