Share News

రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

ABN , Publish Date - Apr 29 , 2026 | 12:32 AM

పూండి-బెండి గేట్‌ రైల్వేట్రాక్‌ వద్ద రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్టు పలాస జీఆర్‌పీ ఎస్‌ఐ కోటేశ్వర్రావు చెప్పారు.

రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

వజ్రపుకొత్తూరు, ఏప్రిల్‌ 28(ఆఽంధ్రజ్యోతి): పూండి-బెండి గేట్‌ రైల్వేట్రాక్‌ వద్ద రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్టు పలాస జీఆర్‌పీ ఎస్‌ఐ కోటేశ్వర్రావు చెప్పారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. మృతుడు వయస్సు 30 నుంచి 35 మధ్య ఉండొచ్చని చెప్పారు. చేతి వేళ్ల పై ఓటు వేసిన ఇంకు పెట్టి ఉందన్నారు. నీలం రంగు పూల్‌ హ్యాండ్స్‌ షర్టుకాపీ రంగు గల ఫ్యాంట్‌ ధరించి ఉన్నట్టు పేర్కొన్నా రు. మృతదేహం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని వివరాలు కోసం 9247585743 ఫోన్‌ నెంబర్ల సంప్రదించాలని ఆయన కోరారు.

అనారోగ్యంతో ఆర్మీజవాన్‌..

వజ్రపుకొత్తూరు, ఏప్రిల్‌ 28(ఆంధ్రజ్యోతి): గోవింద పురం గ్రామానికి చెందిన ఆర్మీజవాన్‌ డొక్కరి సింహా చలం (40) ఆనారోగ్యంతో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీలోని ఆర్‌ఆర్‌ ఆసుపత్రిలో సింహాచలం అనారోగ్యంతో బాధపడుతూ కొద్దిరోజులుగా చికిత్సపొందున్నారు. మంగళవారం పరి స్థితి విషమించి మృతి చెందాడు. 22 ఏళుగా భారత సైన్యంలో సేవలు అందించిన సింహాచలం మృతితో గోవిందపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సింహాచలానికి భార్య, ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. కాగా మృతదేహం బుధవారం గ్రామానికి తీసుకురానున్నట్టు కుంటుంబ సభ్యులు తెలిపారు.

Updated Date - Apr 29 , 2026 | 12:32 AM