రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి
ABN , Publish Date - May 14 , 2026 | 12:39 AM
పూండి- నౌపడా రైల్వేస్టేషన్ల మధ్య బుధవారం రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్టు పలాస జీఆర్‌పీ ఎస్‌ఐ కోటేశ్వరరావు చె ప్పారు.
వజ్రపుకొత్తూరు, మే 13(ఆంధ్రజ్యోతి): పూండి- నౌపడా రైల్వేస్టేషన్ల మధ్య బుధవారం రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్టు పలాస జీఆర్‌పీ ఎస్‌ఐ కోటేశ్వరరావు చె ప్పారు. మృతుడి వయస్సు 40 నుంచి 50 ఏళ్లు మధ్య ఉండొచ్చని తెలిపారు. మృతుడి కుడిచేతిపై తెలుగులో సాయిరాం అని పచ్చబొట్టు రాసి ఉందని, చామనచాయ రంగు కలిగి ఉన్నట్టు తెలిపారు. తెలుపురంగు ఫుల్‌హ్యాండ్ షర్టు తెల్లటి గీతలు కలిగిన లుంగీ, చేతి బెల్టు సొనాటా వాచీ ఉందని వెల్లడించారు. మరిన్ని వివరాలుకు 9247585743, 9492250069 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని కోరారు.
వ్యక్తిపై కేసు నమోదు
మెళియాపుట్టి (కొత్తూరు), మే 13(ఆంధ్రజ్యోతి): విధి నిర్వాహణలో ఉన్న ఏఎస్‌ఐ గోవిందరావు కాళ్లపైకి కొత్తూరు గ్రామానికి చెందిన రావాడ సాయికు మార్ తన ద్విచక్రవాహనంతో ఎక్కించి గాయపరిచిన ఘటనపై కేసు నమోదు చేసినట్టు సీఐ ప్రసాద్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల మేరకు.. మంగళవారం డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తుండగా పోలీసులు సాయికుమార్ మద్యం తాగాడని అను మానంతో పోలీసు స్టేషన్‌ను తరలించేందుకు ఫొటో తీస్తుండగా ద్విచక్రవాహనం తో ఏఎస్‌ఐ గోవిందరావును ఢీకొట్టి గాయపరిచాడు. ఏఎస్‌ఐ ఇచ్చిన ఫిర్యాదుమేర కు సాయికుమార్‌పై కేసు నమోదు చేసి బుధవారం అరెస్టు చేసినట్టు తెలిపారు. కొత్తూరు కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు సీఐ ప్రసాద్ తెలిపారు.