రైలుకింద పడి గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య
ABN , Publish Date - Apr 18 , 2026 | 11:53 PM
స్థానిక రైల్వేస్టేషన్ ఫ్లాట్‌ఫారం వద్ద బెంగళూరు-గౌహతి రైలుకింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్నాడు.
పలాస, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): స్థానిక రైల్వేస్టేషన్ ఫ్లాట్‌ఫారం వద్ద బెంగళూరు-గౌహతి రైలుకింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం అర్ధరాత్రి సాధారణ ప్రయాణికుడిలా రైలు ఎక్కేందుకు 40 సంవత్సరాల వయసు గాల ఒక వ్యక్తి వచ్చారు. ఈ క్రమంలో బెంగళూరు- గౌహతి ఎక్స్‌ప్రెస్ రైలు రావడంతో దానికింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వి వరాలు తెలియరాకపోవడంతో అతడి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు. వివరాలు తెలిసినవారు తమను సంప్రదించాలని రైల్వే పోలీసులు తెలిపారు.
కలకలం రేపిన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం
పలాస, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): స్థానిక తాళభద్ర ఎల్‌ిసీ గేటుకు సమీ పంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదే హం శనివారం కలకలం రేపింది. రోడ్డు పక్కన చెట్ల మధ్య పడిఉన్న మృత దేహాన్ని స్థానికులు గుర్తించి కాశీబుగ్గ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు 45 సంవత్సరాల వయసు ఉండొచ్చని, మృతి చెంది రెండు రోజులు కావొచ్చని పోలీసులు బావిస్తున్నారు. మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జగ్గన్న చెరువులో మృతదేహం
ఆమదాలవలస, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి): పట్టణ పరిధి మెట్టక్కివలస ప్రాంతంలోని జగ్గన్న చెరువులో శనివారం మృతదేహం కలకలం రేపింది. నీటిలో తేలుతున్న ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఎస్‌ఐ సనపల బాలకృష్ణ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని మృత దేహాన్ని పరిశీలించి గ్రామానికి చెందిన కోరాడ పారయ్య (55)గా గుర్తించారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. కుటుంబ సభ్యుల నుంచి సమాచారాన్ని ఎస్‌ఐ సేకరించారు. పారయ్యకు నిత్యం మద్యం తాగే అలవాటు ఉందని, శుక్ర వారం సాయంత్రం మద్యం మత్తులో తన ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి శనివారం ఉదయం జగ్గన్న చెరువులో మృతదేహం కనిపించిందని తెలిపారు. మృతుడి అల్లుడు కిల్లి క్రాంతికుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవపంచనామా అనంతరం మృతదేహాన్ని శ్రీకాకుళం సర్వజన ఆసుప త్రికి పోస్టుమార్టం నిమిత్తంతరలించడం జరిగిందన్నారు. మృతుడికి భార్య రూప వతితో పాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు.