Share News

‘జగతిమెట్ట’ అక్రమాలు వెలికితీయండి

ABN , Publish Date - Apr 06 , 2026 | 12:38 AM

జగతిమెట్ట దరి జగనన్న కాలనీలో పెద్దఎత్తున అవినీతి, అక్ర మాలు చోటుచేసుకున్నాయని అధికారులు ద్వారా తేటతెల్లమవుతుందని, నెల రోజుల్లో వీటిని వెలికి తీయాలని రెవెన్యూ అధికారులను మంత్రి కింజ రాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు.

‘జగతిమెట్ట’ అక్రమాలు వెలికితీయండి
కాలనీవాసుల సమస్యలు తెలుసుకుంటున్న మంత్రి అచ్చెన్నాయుడు

  • నెల రోజుల్లో తేల్చాలి

  • మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

  • తొలిసారి జగనన్న కాలనీ సందర్శన

టెక్కలి, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): జగతిమెట్ట దరి జగనన్న కాలనీలో పెద్దఎత్తున అవినీతి, అక్ర మాలు చోటుచేసుకున్నాయని అధికారులు ద్వారా తేటతెల్లమవుతుందని, నెల రోజుల్లో వీటిని వెలికి తీయాలని రెవెన్యూ అధికారులను మంత్రి కింజ రాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం జగతిమెట్ట వద్ద గల జగనన్న కాలనీలో మంత్రి పర్య టించారు. నిజమైన పేదలకు అన్యాయం జరగకుండా చూడాలసి సూచించారు. కాలనీ ప్రాంతంలో వీధిలైట్లు, తాగునీటి సౌకర్యం యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు దిశ నిర్దేశం చేశారు. జగతిమెట్ట లేఅవుట్‌ పరిధిలో ఎవరికి పట్టాలు ఇచ్చారు? ఇల్లు కట్టింది ఎవరు? జాబితాలు పరిశీలించాలని, దర్యాప్తు సమ యంలో సహకరించని కాలనీ వాసుల ఇళ్లు అవసరమైతే రద్దు చేయాలని అధి కారులకు సూచించారు. ఆర్డీవో ఎం.కృష్ణ మూర్తి మా ట్లాడుతూ.. ఇందుకు సం బంధించిన లేఅవుట్‌ వివరాలు తహసీ ల్దార్‌, సబ్‌కలెక్టర్‌ కార్యాలయాల్లో లేవని, 400 లేఅవుట్లు ఇచ్చిన రిజిస్ట్రర్‌ దొరకలే దని, పట్టాలు పంపిణీ వివరాలు, లాట రీ ద్వారా ఇళ్ల కేటాయింపుల వివరాలు కూడా లేవని తెలిపారు. ఇప్పుడిచ్చిన పట్టాల్లో సుమారు 70మంది వరకు అనర్హులు ఉన్నారని గుర్తించామన్నారు. దీనిపై స్పందించిన మంత్రి జగతిమెట్ట కాలనీ అక్రమాలు వెలికితీసేందుకు రెవెన్యూ యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని ఆదేశించారు. అనంతరం పలువురు తమ సమస్యలపై మంత్రికి వినతిపత్రాలు అందజేశారు. సమావేశంలో కింజరాపు ప్రసాద్‌, ఏఎంసీ చైర్మన్‌ బగాది శేషగిరి, నందిగాం మండల పార్టీ అధ్యక్షులు పినకాన జోగారావు, పినకాన అజయ్‌కుమార్‌, మెండ దమయంతి, సుందరమ్మ, పోలాకి చంద్రశేఖర్‌, కోళ్ల లవకుమార్‌, మామిడి రాము, సీపాన వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

ఫిల్లింగ్‌ స్టేషన్‌ ప్రారంభం

టెక్కలి, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): నాలుగు దశాబ్దాలుగా జరిగిన అభివృద్ధికి భిన్నంగా టెక్కలి అభివృద్ధి చరిత్ర తిరిగి రాస్తానని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆదివారం స్థానిక జగతిమెట్ట జంక్షన్‌ పరిధిలో ఐవోసీ ఆధ్వర్యంలో నిర్మించిన సబ్‌కలెక్టర్‌ ఫిల్లింగ్‌స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌, ఆర్డీవో ఎం.కృష్ణమూర్తితో కలిసి టెక్కలి ప్రాంత అభివృద్ధిపై సమీక్షించారు. శ్రీకాకుళం లో కార్గిల్‌ పార్క్‌ తరహా టెక్కలిలో కూడా పట్టుమహాదేవి కోనేరును అభివృద్ధి చేయాలన్నారు. కోనేరులో ఎన్టీఆర్‌ విగ్రహ నిర్మాణానికి ఫౌంటైన్‌ చేపట్టాలని, బండింగ్‌ పనులు చేపట్టాలన్నారు. అలాగే జగతిమెట్ట జంక్షన్‌ పరిధిలో 55సెంట్ల ప్రభుత్వ స్థలం ఆక్రమణలు తొలగింపులు ఏమేరకు వచ్చాయని ఆరాతీశారు. జాతీయరహదారి పక్కన అటవీశాఖ గెస్ట్‌హౌస్‌ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని వివరించారు. కార్యక్రమంలో ఐవోసీ డివిజినల్‌ రిటైల్‌ సేల్‌ హెడ్‌ డి.బుచ్చయ్య, సీనియర్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు, సేల్స్‌మేనేజర్‌ రాజీవ్‌కుమార్‌, మేనేజర్‌ ప్రశాంత్‌, టీడీపీ నాయకులు కింజరాపు ప్రసాద్‌, బగాది శేషగిరి, పినకాన అజయ్‌కుమార్‌, పినకాన జోగారావు, మెండ దమయంతి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 06 , 2026 | 12:38 AM