Share News

అప్పుల బాధ తాళలేక..

ABN , Publish Date - Jul 28 , 2026 | 11:43 PM

Lawyer couple's suicide attempt శ్రీకాకుళం నగరం బాయమ్మతోటకు చెందిన దవళ రామకృష్ణారావు(61), శ్రీదేవి దంపతులు మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిద్దరూ లావేరు మండలం గురుగుబిల్లి జంక్షన్‌ సమీపాన తాళ్లవలస పరిసర ప్రాంతంలోని సరుగుడు తోటలో పురుగుల మందు తాగారు. ఆపై మెడకు వైరు బిగించుకున్నారు. ఈక్రమంలో రామకృష్ణారావు మృతి చెందారు. శ్రీదేవి అపస్మారకస్థితికి చేరుకుంది.

అప్పుల బాధ తాళలేక..
శ్రీదేవిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం.. ఇన్‌సెట్‌లో రామకృష్ణ (ఫైల్‌)

  • న్యాయవాది దంపతుల ఆత్మహత్యాయత్నం

  • భర్త మృతి.. భార్య పరిస్థితి విషమం

  • లావేరు మండలంలో ఘటన

  • శ్రీకాకుళం క్రైం/ లావేరు, జూలై 28 (ఆంధ్రజ్యోతి): వారిద్దరూ భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. పిల్లలను కష్టపడి చదివించి ప్రయోజకులను చేశారు. కుమార్తెకు వివాహం చేశారు. సాఫీగా సాగాల్సిన వారి జీవితాన్ని అప్పుల ఊబి ముంచేసింది. ఆర్థిక ఇబ్బందులతో ఆ దంపతులిద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో భర్త మృతి చెందగా.. భార్య ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. లావేరు మండలంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

  • శ్రీకాకుళం నగరం బాయమ్మతోటకు చెందిన దవళ రామకృష్ణారావు(61), శ్రీదేవి దంపతులు మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిద్దరూ లావేరు మండలం గురుగుబిల్లి జంక్షన్‌ సమీపాన తాళ్లవలస పరిసర ప్రాంతంలోని సరుగుడు తోటలో పురుగుల మందు తాగారు. ఆపై మెడకు వైరు బిగించుకున్నారు. ఈక్రమంలో రామకృష్ణారావు మృతి చెందారు. శ్రీదేవి అపస్మారకస్థితికి చేరుకుంది. పురుగుల మందు తాగిన వెంటనే.. ఆ సమాచారాన్ని శ్రీదేవి ఫోన్‌ ద్వారా బంధువులకు తెలిపింది. తమను కాపాడాలని కోరింది. ఈ మేరకు బంధువులు, స్థానికులు అక్కడకు చేరుకుని పరిశీలించగా.. అప్పటికే రామకృష్ణారావు మృతి చెందారు. అంబులెన్స్‌లో శ్రీదేవిని రణస్థలం సీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అక్కడ నుంచి శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్పించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. సంఘటనా స్థలాన్ని లావేరు ఎస్‌ఐ వి.సందీప్‌ కుమార్‌ పరిశీలించారు. రామకృష్ణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

  • ఆర్థిక ఇబ్బందులే కారణమా?

  • దవళ రామకృష్ణారావు న్యాయవాది. వృత్తిరీత్యా శ్రీకాకుళం నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద బాయమ్మతోటలో భార్య శ్రీదేవితో కలిసి నివాసం ఉంటున్నారు. వీరి కుమార్తె అర్షిత ఎంబీబీఎస్‌ పూర్తిచేసింది. రెండేళ్ల కిందట వివాహం కాగా.. భర్తతో కలిసి ఆమె పూణేలో ఉంటోంది. కుమారుడు కృష్ణసాయి దంత వైద్యుడు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో నివసిస్తున్నారు. కృష్ణసాయికి ఇంకా వివాహం కాలేదు. కాగా.. అప్పులు, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే రామకృష్ణారావు దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని స్థానికులు పేర్కొంటున్నారు. మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో ఆ దంపతులిద్దరూ లావేరు పరిసర ప్రాంతాల్లో కారులో తిరిగారని చెప్పారు. ఈ అఘాయిత్యానికి పాల్పడతారని ఊహించలేదన్నారు. ఈ ఘటనలో స్థానికులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

Updated Date - Jul 28 , 2026 | 11:43 PM