Share News

ద్విచక్ర వాహనం దగ్ధం

ABN , Publish Date - Aug 19 , 2026 | 12:17 AM

మండల కేంద్రం నందిగాం అండర్‌పాసేజ్‌ వంతెన వద్ద మంగళవారం సాయంత్రం ద్విచక్ర వాహనం దగ్ధమైంది.

 ద్విచక్ర వాహనం దగ్ధం
కాలిపోతున్న ద్విచక్ర వాహనం

నందిగాం, ఆగస్టు 18(ఆంధ్ర జ్యోతి): మండల కేంద్రం నందిగాం అండర్‌పాసేజ్‌ వంతెన వద్ద మంగళవారం సాయంత్రం ద్విచక్ర వాహనం దగ్ధమైంది. నందిగాం సమీపంలో దాబా నిర్వహిస్తున్న వ్యకి బజారుకు వెళ్లి తిరిగి అండర్‌పాసేజ్‌ బ్రిడ్జికి వచ్చేసరికి వాహనం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగానే మంటలు రేగి వాహనం దగ్ధమైనట్లు బైక్‌ మెకానిక్‌ తెలిపారు.

నందిగాం4:

Updated Date - Aug 19 , 2026 | 12:17 AM