Share News

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు

ABN , Publish Date - Apr 24 , 2026 | 12:38 AM

కృష్ణాపురం సమీపంలో గురువారం రాత్రి 8 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు

  • ఒకరి పరిస్థితి విషమం

పొందూరు, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): కృష్ణాపురం సమీపంలో గురువారం రాత్రి 8 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివ రాల మేరకు.. కేశవదాసుపురానికి చెందిన పల్ల రాజ్‌కుమార్‌, లావేరు మండలం బుడుమూరు కు చెందిన పి.దుర్గాప్రసాద్‌ లైటింగ్‌ పనులు చేస్తుంటారు. గురువారం బైక్‌పై పనిమీద పొందూరు వస్తుండగా కృష్ణాపురం వద్ద ఆగి ఉన్న బస్సును త ప్పిం టచబోయి ఎదురుగా వస్తున్న ఆటో ను ఢీకొట్టారు. ఇద్దరూ రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108కి సమాచారం ఇవ్వగా.. వారిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేక రించారు. కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

కరజాడ వద్ద రోడ్డు ప్రమాదం

  • వృద్ధుడికి తీవ్ర గాయాలు

శ్రీకాకుళం రూరల్‌, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): కరజాడ సమీపా న జాతీయ రహ దారిపై గురువా రం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకు ళం రూరల్‌ ఎస్‌ఐ కె.రాము తెలిపిన వివరాల మేరకు.. వెస్ట్‌ బెంగాల్‌కు చెందిన లారీ శ్రీకాకుళం నుంచి నరసన్నపేట వైపు వెళ్తుంది. ఇదే సమంలో కరజాడ సమీపానికి వచ్చే సరికి ముందుగా వెళ్తు న్న కారును లారీ ఢీకొంది. దీంతో కారు అదుపుతప్పి పల్టీకొట్టి కుడివైపుగా వెళ్తు న్న మరో కారును ఢీకొంది. దీంతో ఈ కారు కూడా డివైడర్‌ను ఢీకొంది. కాగా పల్టీలు కొట్టిన కారులో ప్రయాణిస్తున్న వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డాడు. మరో కారులో నలుగురు ఫిషరీస్‌ శాఖకు చెందిన వారు ఉన్నారు. వీరు శ్రీకాకుళం నుం చి ఇచ్ఛాపురం వెళుతున్నారు. క్షతగాత్రులను వాహనచోదకులు, గ్రామస్థులు అం బులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వృద్ధుడిని శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు శ్రీకాకుళం రూరల్‌ ఎస్‌ఐ కె.రాము తెలిపారు.

1111111111111111

Updated Date - Apr 24 , 2026 | 12:38 AM