జాతీయ సపక్‌తక్రా పోటీలకు ఇద్దరు ఎంపిక
ABN , Publish Date - Sep 04 , 2026 | 12:05 AM
జమ్ము-కాశ్మీర్ రాష్ట్రం శ్రీనగర్‌లో ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు జరగనున్న జాతీయస్థాయి సబ్ జూనియర్ సపక్‌తక్రా పోటీలకు జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారులు ఎంపిక య్యారు.
శ్రీకాకుళం స్పోర్ట్స్, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): జమ్ము-కాశ్మీర్ రాష్ట్రం శ్రీనగర్‌లో ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు జరగనున్న జాతీయస్థాయి సబ్ జూనియర్ సపక్‌తక్రా పోటీలకు జిల్లా నుంచి ఇద్దరు క్రీడాకారులు ఎంపిక య్యారు. రాష్ట్రస్థాయిలో బాలురు అండర్-14 విభాగంలో దేవా, కార్తీక్ సత్తా చాటి రాష్ట్రం తరఫున జాతీయ పోటీలకు ఎంపికయ్యారని సపక్‌తక్రా జిల్లా సంఘం చైర్మన్ ఎమ్మెస్సార్ కృష్ణమూర్తి తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వలు వచ్చాయన్నారు. జాతీయ పోటీలకు క్రీడాకారులు ఎంపికై సంఘం చైర్మన్‌తోపాటు శిక్షకుడు అర్జున్‌రెడ్డి, సీనియర్ క్రీడాకారులు జి.కొర్లయ్య, కె.సింహాచలం పి.సంతోష్, ప్రవీణ్ తదితరులు హర్షం వ్యక్తంచేసి అభినందించారు.