Share News

వేర్వేరు రైలు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

ABN , Publish Date - May 04 , 2026 | 12:08 AM

శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రై ల్వేస్టేషన్‌ పరిధిలో ఆదివారం జరిగిన వేర్వేరు రైలు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

వేర్వేరు రైలు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

ఆమదాలవలస, మే 3 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రై ల్వేస్టేషన్‌ పరిధిలో ఆదివారం జరిగిన వేర్వేరు రైలు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. జీఆర్పీ ఎస్‌ఐ జి.మధుసూదనరావు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. 12840 నెంబర్‌ రైలు చెన్నై నుంచి హౌరా వెళుతుండగా మెయిన్‌ పట్టణ శివారులోని పాత రైల్వేగేటు వద్ద ఆమదాలవలస పట్టణం ఒకటో వార్డు తిమ్మాపురానికి చెందిన గేదెల జగన్నాథం (59) రైలు కిందపడి మృతి చెందాడు. మృతుడు భిక్షాటన చేస్తుంటాడని స్థానికులు చెబుతున్నారు.

రైల్వే స్టేషన్‌ శివారులో 18047 వాస్కోడిగామా రైలు కింద పడి ఒక వ్యక్తి మృతి చెందినట్టు జీఆర్పీ ఎస్‌ఐ మధుసూదనరావు తెలిపారు. మృతుడి వద్ద ఉన్న సమాచారం మేరకు కోల్‌కతాకు చెందిన కరణం సత్య నారాయణ (52)గా గుర్తించడం జరిగిందన్నారు. కోల్‌కతా వెళ్లాల్సిన వ్యక్తి వాస్కోడిగామా రైలు ఎక్కి మళ్లీ దిగేందుకు ప్రయత్నిస్తూ.. రైలు కింద పడి మృతి చెందాడన్నారు. ఈ మేరకు కేసును నమోదు చేసి మృతదేహాన్ని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించినట్లు జీఆర్పీ ఎస్‌ఐ మధుసూదనరావు తెలిపారు.

Updated Date - May 04 , 2026 | 12:08 AM