Share News

కొట్లాటలో ఇద్దరికి గాయాలు

ABN , Publish Date - Apr 23 , 2026 | 12:20 AM

పలాస మం డలం మామిడిపల్లి గ్రామానికి చెందిన మురిపింటి కుమార్‌రా జు, జుత్తు గంగరాజు కుటుం బాల మధ్య బుధవారం రాత్రి జరిగిన గొడవ కొట్లాటికి దారితీ సింది.

కొట్లాటలో ఇద్దరికి గాయాలు

పలాస రూరల్‌, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): పలాస మం డలం మామిడిపల్లి గ్రామానికి చెందిన మురిపింటి కుమార్‌రా జు, జుత్తు గంగరాజు కుటుం బాల మధ్య బుధవారం రాత్రి జరిగిన గొడవ కొట్లాటికి దారితీ సింది. ఈ ఘటనలో మురిపిం టి సంధ్య, జుత్తు గంగరాజు గాయపడ్డారు. పోలీసులు తెలి పిన వివరాల మేరకు.. కుమార్‌ రాజు, గంగరాజు కుటుంబాల నడుమ కొన్నాళ్లగా తగాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఇరు కుటుంబాల నడుమ గొడవ జరగి కొట్లాటకు దారితీసింది. ఈ ఘటనలో జుత్తు గంగరాజుకు తలపైన, మురి పింటి సంధ్యకు చేతులపైన గాయాలయ్యాయి. వీరిని 108వాహనంలో చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కాశీబుగ్గ పోలీసులు తెలిపారు.

రైలునుంచి జారిపడి మహిళకు గాయాలు

పాతపట్నం, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): రూర్కెలా నుంచి గుణుపూర్‌ వచ్చే రాజారాణి ఎక్స్‌ప్రెస్‌ రైలు నుంచి బుధవారం సుమిత్ర పండా అనే మహిళ జారిపడి గాయపడింది. మెళియాపుట్టి మండలం సుందరాడ గ్రామానికి చెందిన సుమిత్ర పండా ఖరగ్‌పూర్‌ నుంచి వచ్చి.. పాతపట్నం రైల్వే స్టేషన్‌ వద్ద దిగు తుండగా జారిపడగా తలకు, ఎడమచేయికు తీవ్రగాయాలయ్యాయి. స్థానిక సీహెచ్‌సీకు తీసుకురాగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్‌కు..

కంచిలి, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని వైష్ణవి దాబా సమీపంలో బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ వరహాలు నాయుడికి తీవ్రగాయాలయ్యాయి. కంచిలి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. హైవే పెట్రోల్‌ వాహనానికి డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న వరహాలు నాయుడు ఎప్పటిలాగే బుధవారం విధుల్లో ఉన్నాడు. బహిర్భూమికి వెళ్లి తిరిగి వస్తుండగా ధాబా ఎదురుగా ఉన్న సర్వీస్‌ రోడ్డు (మఖరాంపురం నుంచి కంచిలి) వద్ద వేగంగా వస్తున్న వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడి తలకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు హెచ్‌సీ రూప్‌కుమార్‌ తెలిపారు.

ట్రాక్టర్‌ ఢీకొని ఒకరికి..

బూర్జ, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): ఎల్‌ఎన్‌ పేట మండలం కొత్తబలేరు గ్రామానికి చెందిన సవర లింగయ్యను ట్రాక్టర్‌ ఢీకొనడంతో గాయాలపాల య్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలి లా ఉన్నాయి.. బుధవారం కొత్తబాలేరు నుంచి తన మేనకోడలు పెళ్లి పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై పాలకొండ వెళుతుండగా బూర్జ మండలం లక్కుపురం జంక్షన్‌ వద్ద పాలకొండ నుంచి శ్రీకాకుళం వైపు వెళుతున్న ట్రాక్టర్‌ ఢీకొం ది. స్థానికులు ఇచ్చిన సమా చారం మేరకు 108 వాహనంతో పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. హెడ్‌ కానిస్టేబుల్‌ ఎస్‌.ఎన్‌.మూర్తి కేసు నమోదు చేశారు.

బైక్‌ను ఢీకొన్న వ్యాన్‌... వ్యక్తికి తీవ్రగాయాలు

కంచిలి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): మఖరాంపురం జంక్షన్‌ ఆదివారం సంత సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాల య్యాయి. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఇచ్ఛాపురం మండలం బెనుగానిపేటకి చెందిన తిప్పన నూకయ్య ద్విచక్ర వాహనంపై ఇచ్ఛాపురం నుంచి పలాస వైపు వెళుతున్నాడు. సంత సమీపంలో అదే దిశలో వెళుతున్న డీసీఎం వ్యాన్‌ బైక్‌ను బలంగా ఢీకొంది. దీంతో నూకయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు 108లో సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Apr 23 , 2026 | 12:20 AM