లిఫ్ట్ వైరు తెగిపడి ఇద్దరి మృతి
ABN , Publish Date - Jun 13 , 2026 | 12:05 AM
నగరంలో భవన నిర్మాణ పనుల్లో శుక్రవారం అప శృతి చోటు చేసుకుంది. భవన నిర్మాణానికి అను వుగా ఏర్పాటు చేసిన లిఫ్ట్ వైర్లు తెగిపోవడంతో ఇద్దరు మృతి చెందారు.
మృతులు తాపీమేస్త్రి, భవన నిర్మాణ కార్మికుడు..
శ్రీకాకుళం క్రైమ్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): నగరంలో భవన నిర్మాణ పనుల్లో శుక్రవారం అప శృతి చోటు చేసుకుంది. భవన నిర్మాణానికి అను వుగా ఏర్పాటు చేసిన లిఫ్ట్ వైర్లు తెగిపోవడంతో ఇద్దరు మృతి చెందారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. ఎచ్చెర్ల పంచాయతీ రామ్‌నగర్ కాలనీకి చెందిన తాపీమేస్త్రి జరంగుల సూర్యనారాయణ (53), ఎచ్చెర్ల మండలం గొల్లపేటకి చెందిన భవన నిర్మాణ కార్మికు డు బొట్ట ముఖ లింగం (55) శ్రీకాకుళం నగరంలో పీఎన్ కాలనీ నాలుగో లైన్‌లో నాగావళి ఎన్‌క్లేవ్‌లో భవనం పనులకు వెళ్తున్నారు. భవనంపైకి నిర్మాణ సామగ్రి, కూలీలను తీసుకువెళ్లేందుకు గాను వెలుపల లిఫ్ట్‌ను ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రం పనులు ముగించుకుని భవనం పైనుంచి కిందకు దిగుదామని లిఫ్ట్ ఎక్కి సూర్యనారాయణ స్విచ్ నొక్కాడు. అయితే ప్రమాద వశాత్తు లిఫ్ట్ వైరు తెగిపోవడంతో ఎగిరిపడి సూర్యనారాయణ కిందపడి తీవ్రగాయాలయ్యాయి. భవనం కిందన ఉన్న ముఖలింగంపై ఆ లిఫ్ట్ పడింది. ఈ ఘటనలో ముఖలింగానికి తీవ్రగా యాలయ్యాయి. ఇద్దరినీ కిమ్స్ ఆసుపత్రిలో హుటాహుటిన చేర్పించారు. పరిస్థితి విషమించి సూర్యనారాయణ, ముఖలింగం చికిత్స పొందు తూ మృతిచెందారు. సూర్యనారాయణకు భార్య భారతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. సమాచారం అందుకున్న రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు ఘటనా స్థలానికి, ఆసుపత్రికి వెళ్లి వివరాలు సేకరిం చారు. మృతుడు సూర్యనారాయణ కుమారుడు రాజేష్ ఇచ్చిన ఫిర్యా దు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు మృతిచెంద డంతో ఆయా కుటుంబాలో విషాదచాయలు అలముకున్నాయి.