Share News

ఇద్దరు గొలుసు దొంగల అరెస్టు

ABN , Publish Date - Oct 10 , 2026 | 12:02 AM

రైలు ప్రయాణికుల మెడలో బంగారం చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగ లను అరెస్టు చేసి వారి నుంచి 22 గ్రాముల పుస్తెల తా డును స్వాధీనం చేసు కున్నట్లు రైల్వే ఎస్‌ఐ డి.శ్రీనివాసరావు తెలిపారు.

 ఇద్దరు గొలుసు దొంగల అరెస్టు
నిందితులతో రైల్వే పోలీసులు

  • 22 గ్రాముల బంగారం స్వాధీనం

పలాస, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): రైలు ప్రయాణికుల మెడలో బంగారం చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగ లను అరెస్టు చేసి వారి నుంచి 22 గ్రాముల పుస్తెల తా డును స్వాధీనం చేసు కున్నట్లు రైల్వే ఎస్‌ఐ డి.శ్రీనివాసరావు తెలిపారు. ఒడిశా రాష్ట్రం జింకియా పోలీసు స్టేషన్‌ పరిధికి చెందిన సంతోష్‌కుమార్‌ బోయ్‌, మనోజ్‌కండిలు రైలులో నిద్రిస్తున్న ప్రయాణికులే లక్ష్యంగా పెట్టుకొని దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. ఖుర్దారోడ్‌, బ్రహ్మపూర్‌, సోంపేట, పలాస రైలు మార్గాల్లో ప్రయాణించి దొంగతనాలు చేశారన్నారు. బాధితుల ఫిర్యాదుపై పోలీసులు నిఘా వేసి నిందితులను శుక్రవారం పట్టుకొని వారి నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిని విశాఖపట్నం రైల్వేకోర్టులో హాజరుపరిచినట్టు తెలిపారు.

Updated Date - Oct 10 , 2026 | 12:02 AM