చోరీ కేసుల్లో ఇద్దరి అరెస్టు
ABN , Publish Date - Mar 12 , 2026 | 12:18 AM
జిల్లాలో పలు చోరీలకు పాల్పడిన ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాం డ్‌కు తరలించినట్లు టూటౌన్ సీఐ ఈశ్వరరావు బుధ వారం తెలిపారు.
71 గ్రాముల బంగారం, 11 తులాల వెండి రికవరీ
శ్రీకాకుళం క్రైం, మార్చి 11(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలు చోరీలకు పాల్పడిన ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాం డ్‌కు తరలించినట్లు టూటౌన్ సీఐ ఈశ్వరరావు బుధ వారం తెలిపారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఎచ్చెర్ల మండలం ముద్దాడ గ్రామానికి చెందిన ముద్దాడ నర్సిం గరావు, ఆమదాలవలస మండలం తోటవాడకు చెందిన బెండి శివప్రసాద్ జైలు నుంచి గతేడాది సెప్టెంబరు 21న విడుదలయ్యారు. ఈ క్రమంలో శ్రీకాకుళం పీఎన్ కాలనీ, ఆమదాలవలస, బొబ్బిలి, చీపురుపల్లి ప్రాంతాల్లో పలు ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. సుమారు 71 గ్రాముల బంగారం, 11 తులాల వెండి అపహరించారు. వీరు బుధవారం శ్రీకాకుళం నగరంలోని బైరివానిపేట జం క్షన్ వద్ద ద్విచక్ర వాహనంపై వస్తుండగా టూటౌన్ పో లీసులు వాహన తనిఖీలు చేస్తుండగా సదరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండడంతో పట్టుకుని స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. వీరిపై శ్రీకాకుళంతో పాటు విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ పట్నం జిల్లాల్లో కూడా పలు చోరీ కేసుల నమోదైనట్టు సీఐ ఈశ్వరరావు తెలిపారు. వీరి నుంచి 71 గ్రాముల బంగారం, 11 తులాల వెండి రికవరీ చేసి కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.