Share News

హత్యాయత్నం కేసులో ఇద్దరి అరెస్టు

ABN , Publish Date - Mar 14 , 2026 | 12:44 AM

కొండవూరు గ్రామంలో గత నెల 4న కొల్లి నాగేశ్వర్రావుపై జరిగిన హత్యాయత్నం కేసులో అదే గ్రామానికి చెందిన కొల్లి యోగి, బెండి గ్రామానికి చెందిన రెల్ల ప్రశాంత్‌ను శుక్రవారం అరెస్టు చేసి ఎస్‌ఐ బి.నిహార్‌ చెప్పారు.

హత్యాయత్నం కేసులో ఇద్దరి అరెస్టు

వజ్రపుకొత్తూరు, మార్చి 13(ఆంధ్రజ్యోతి): కొండవూరు గ్రామంలో గత నెల 4న కొల్లి నాగేశ్వర్రావుపై జరిగిన హత్యాయత్నం కేసులో అదే గ్రామానికి చెందిన కొల్లి యోగి, బెండి గ్రామానికి చెందిన రెల్ల ప్రశాంత్‌ను శుక్రవారం అరెస్టు చేసి ఎస్‌ఐ బి.నిహార్‌ చెప్పారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. నాగేశ్వర్రావుకు కొల్లి యోగికి మధ్య భూ సమస్యలపై తగాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొల్లి నాగేశ్వర్రావును హతమర్చాలని నిర్ణయించి బెండికి చెందిన మిత్రుడు రెల్ల ప్రశాంత్‌తో కలిసి యోగి పన్నాగం పన్నారు. నాగేశ్వర్రావును హత్యచేసేందుకు సుపారి గ్యాంగ్‌తో మాట్లాడి రెక్కి నిర్వహించారు. ఈ క్రమంలో గత నెల 4న కారులో కొండవూరు వచ్చిన సుపారి గ్యాంగ్‌.. నాగేశ్వర్రావు హతమర్చేందుకు తొలుత ఆయన కళ్లలో కారం చల్లేందుకు ప్రయత్నించారు. కారం దాడి నుంచి తప్పించుకున్న నాగేశ్వర్రావు కేకలు వేయడంతో ఆ సుపారి గ్యాంగ్‌ పరారయింది. వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు నాగేశ్వర్రావు ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ నిహార్‌ ఆధ్వర్యంలో దర్యాప్తు నిర్వహించి అనుమానితులు కొల్లి యోగి, రెల్ల ప్రశాంత్‌ను అదుపులోకి ప్రశ్నించగా అసలు విషయాన్ని బయటపెట్టారు. దీంతో వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి పలాస కోర్టుకు తరలించగా.. న్యాయాధికారి 14 రోజులు రిమాండ్‌ విధించారు. కాగా దాడిలో పాల్గొన్న సుపారి గ్యాంగ్‌కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఎనిమిది మంది పేకాటరాయుళ్ల అరెస్టు

జలుమూరు, మార్చి 13(ఆంధ్రజ్యోతి): జోనంకి సమీపంలో గల మామిడి తోటలో జరుగుతున్న పేకాట శిబిరంపై శుక్రవారం దాడిచేసి ఎనిమిది మందిని అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ బి.అశోక్‌బాబు తెలిపారు. వారి నుంచి రూ.18,190 స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. జోనంకి సమీపంలో పేకాట జరుగుతున్నట్లు పక్కా సమాచారం మేరకు సిబ్బందితో దాడిచేసినట్టు తెలిపారు. కేసు నమోదు చేసి వ్యక్తిగత పూచీకత్తులపై విడుదల చేసినట్టు తెలిపారు.

Updated Date - Mar 14 , 2026 | 12:44 AM