భారీ వాహనాలతో బేజారు
ABN , Publish Date - Jun 22 , 2026 | 11:56 PM
మం డలంలోని అలికాం- బత్తిలి ప్రధాన రోడ్డులో పరి మితికి మించిన బరువుతో భారీ వాహనాల రాక పోకలతో గోతులు ఏర్పడడంతో ప్రయాణికులు, వాహనచోదకులు బేజారవుతున్నారు. దగ్గరకు వచ్చే వరకూ గోతులు కనిపించకపోవడంతో ద్విచక్రవాహ నాలపై వచ్చే వాహనచోదకులు ప్రమాదాలకు గురవు తున్నారు.
ఎల్.ఎన్.పేట, జూన్ 22(ఆంధ్రజ్యోతి): మం డలంలోని అలికాం- బత్తిలి ప్రధాన రోడ్డులో పరి మితికి మించిన బరువుతో భారీ వాహనాల రాక పోకలతో గోతులు ఏర్పడడంతో ప్రయాణికులు, వాహనచోదకులు బేజారవుతున్నారు. దగ్గరకు వచ్చే వరకూ గోతులు కనిపించకపోవడంతో ద్విచక్రవాహ నాలపై వచ్చే వాహనచోదకులు ప్రమాదాలకు గురవు తున్నారు. ఈమార్గంలో శ్రీకాకుళం, పాలకొండ నుం చి హిరమండలం మీదుగా పాతపట్నం, పర్లాకిమిడి మీదుగా ఒడిశాకు, హిరమండలం మీదుగా కొత్తూ రు, బత్తిలి వరకు నిరంతరం వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. .
అధ్వానంగా తోటాడ రహదారి
పోలాకి, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): తోటాడ రోడ్డు అధ్వానంగా మారింది. గోతుల మయంకావడంతో వాహనచోదకులు ఇబ్బందిపడుతున్నారని వినియోగదారుల సంఘం యువజన నాయకులు కె.సుబ్రహ్మణ్యం, సత్యమూర్తి తెలిపారు. సన్యాసిరాజుపేట నుంచి ట్రాక్టర్లతోరాళ్లు తరలించడంతో అధ్వానంగా మారిందని వాపోయారు.