Share News

అవయవదాతకు నివాళి

ABN , Publish Date - Aug 16 , 2026 | 11:47 PM

రాగోలు జెమ్స్‌ ఆసు పత్రిలో బ్రెయిన్‌డెడ్‌ అయిన 37 ఏళ్ల ఉపాధ్యాయురాలు డి.దేవికారాణి అవయవాలను ఆమె కుటుంబ సభ్యులు ఆదివారం దానం చేశారు.

అవయవదాతకు నివాళి
దేవికారాణి మృతదేహం వద్ద నివాళి అర్పిస్తున్న దృశ్యం

శ్రీకాకుళం అర్బన్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): రాగోలు జెమ్స్‌ ఆసు పత్రిలో బ్రెయిన్‌డెడ్‌ అయిన 37 ఏళ్ల ఉపాధ్యాయురాలు డి.దేవికారాణి అవయవాలను ఆమె కుటుంబ సభ్యులు ఆదివారం దానం చేశారు. ఏపీ జీవన్‌దాస్‌ ఆధ్వర్యంలో అవయవాల సేకరణ ప్రక్రియ చేపట్టారు. దేవికా రాణి మృతదేహానికి ఎమ్మెల్యే గొండు శంకర్‌ పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం దాత కుటుంబ సభ్యులకు అవయవదాన ధ్రువీ కరణ పత్రం అందించారు. కార్యక్రమంలో జీవన్‌దాస్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ మన్మథరావు, జెమ్స్‌ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 16 , 2026 | 11:47 PM