Share News

గిరిజన భూములకు రక్షణ కల్పించాలి

ABN , Publish Date - Apr 03 , 2026 | 12:19 AM

గిరిజన భూములకు రక్షణ కల్పించాలని ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ జాతీయ కన్వీనర్‌, మాజీ ఎంపీ మిడియం బాబూరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

గిరిజన భూములకు రక్షణ కల్పించాలి
మాట్లాడుతున్న మాజీ ఎంపీ బాబూరావు

  • మాజీ ఎంపీ మిడియం బాబూరావు

మెళియాపుట్టి, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): గిరిజన భూములకు రక్షణ కల్పించాలని ఆదివాసీ అధికార్‌ రాష్ట్రీయ మంచ్‌ జాతీయ కన్వీనర్‌, మాజీ ఎంపీ మిడియం బాబూరావు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం చాపరలో జరిగిన గిరిజన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. విభజన అనంతరం జిల్లాలో ఐటీడీఏ లేకపోవడం వల్ల గిరిజనులు ఇబ్బంది పడుతున్నా రని తెలిపారు. దీంతో గిరిజనులు తమ సమస్యలు తెలియజేసేందుకు సరైన వేదిక లేకుండా పోయిందన్నారు. అందువల్ల ఐటీడీఏ వచ్చేంత వరకూ గిరిజనులంతా ఐక్యంగా పొరాటాం చేయాలని పిలుపునిచ్చారు. షెడ్యూల్‌ గిరిజన గ్రామాలును షెడ్యూల్‌ ప్రాంతాంలో కలపాలని డిమాండ్‌ చేశారు. గిరిజనులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. గిరిజన సంఘ రాష ్ట్రకార్యదర్శి సురేంద్ర మాట్లాడుతూ.. మద్ధతు ధర కల్పించాలని కోరుతూ ఈ నెల 20న అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘ నాయకులు అప్పన్న, లక్ష్మణరావు, మోహన్‌రావు, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2026 | 12:19 AM