‘గిరిజన దర్బార్ నిర్వహించాలి’
ABN , Publish Date - Mar 04 , 2026 | 11:18 PM
ప్రతి మూడు నెలలకు ఒక సారి మెళియాపుట్టిలో గిరిజన దర్బార్ నిర్వహించాలని పలువురు గిరిజన సంఘ నాయకులు కోరారు.
మెళియాపుట్టి, మార్చి 4(ఆంధ్రజ్యోతి): ప్రతి మూడు నెలలకు ఒక సారి మెళియాపుట్టిలో గిరిజన దర్బార్ నిర్వహించాలని పలువురు గిరిజన సంఘ నాయకులు కోరారు. ఈ మేరకు బుధవారం సీతంపేట లో ఐటీడీఏ పీవో స్వప్నిల్ పవర్ జగన్నాథను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. సమస్యలు విన్నావించడానికి సీతంపేట రావాలంటే గిరిజనులు ఇబ్బందిపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెళియాపుట్టిలో గిరిజన భవనం నిర్మించాలని తెలిపారు. అలాగే గిరిజనులకు ప్రత్యేకంగా డిగ్రీ కళళాల మంజూరు చేయలని కోరారు. గిరిజన గ్రామాల్లో రహదార్లు పెండింగ్ పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గిరిజన సంఘ నాయకులు బి.లక్ష్మీనారాయణ, ధరణి, శ్రీను, ధర్మారావు, జడ్పీటీసీ ఎండయ్య ఉన్నారు.