Share News

‘గిరిజన ఆశ్రమ పాఠశాలను కొనసాగించాలి’

ABN , Publish Date - Jul 04 , 2026 | 11:25 PM

మండలంలోని సవరసిద్ధమణుగు గిరిజన ఆశ్రమ పాఠ శాలను యధావిధిగా కొనసాగించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి డిమాండ్‌ చేశారు.

‘గిరిజన ఆశ్రమ పాఠశాలను కొనసాగించాలి’
పాఠశాల ఎదుట ఆందోళన చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు

పాతపట్నం, జూలై 4(ఆంధ్రజ్యోతి): మండలంలోని సవరసిద్ధమణుగు గిరిజన ఆశ్రమ పాఠ శాలను యధావిధిగా కొనసాగించాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు పాఠశాల ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి శనివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఆశ్రమ పాఠశాలలో గత 20 ఏళ్లుగా 20 గిరిజన గూడల నుంచి సుమారు 200మంది విద్యార్థులు చదువుతున్నారని, ఇప్పుడు మూసివేస్తే వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. జిల్లాలో ఉన్న 47 ఆశ్రమ పాఠశాలలను యధావిధిగా కొనసాగించాలని, లేదంటే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అనంతరం హెచ్‌ఎంకు వినతిపత్రం అందజేశారు.

Updated Date - Jul 04 , 2026 | 11:25 PM