వ్యర్థాలను విశాఖకు తరలించండి
ABN , Publish Date - Nov 21 , 2026 | 11:58 PM
వ్యర్థాలను బహిరంగంగా డంప్ చేయకుండా వాటిని విశాఖ జిందాల్ పవర్‌ప్లాంట్‌కు తరలించాలని బొబ్బిలి మునిసిపల్ కమిషనర్ లాలం రామలక్ష్మి తెలిపారు. రామన్నదొరవలసలో పారిశుధ్య నిర్వహణ మెరుగుపరచా లని చెప్పారు.
బొబ్బిలి, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): వ్యర్థాలను బహిరంగంగా డంప్ చేయకుండా వాటిని విశాఖ జిందాల్ పవర్‌ప్లాంట్‌కు తరలించాలని బొబ్బిలి మునిసిపల్ కమిషనర్ లాలం రామలక్ష్మి తెలిపారు. రామన్నదొరవలసలో పారిశుధ్య నిర్వహణ మెరుగుపరచా లని చెప్పారు. పట్టణంలో ఎక్కడా బహిరంగ మలవిసర్జన జాడలు కనిపించకూడదని, దీనిని కఠినంగా కట్టడి చేయాలని ఆదేశించారు. శనివారం మునిసిపాలిటీలోని రామ య్యచెరువు ఏరియా, కొత్త ఎరుకలివీధి, ఓంకార్‌థియేటర్‌రోడ్డు, బాలాజీనగర్, దాడితల్లి గుడి ప్రాంతాల్లోపరిశీలించారు. బాలాజీనగర్ శ్మశానవాటిక ప్రహరీగోడ పెండింగ్ పనులను పూర్తిచేయాలని ఏఈ గుప్తను ఆదేశించారు. పట్టణంలో పారిశుధ్య నిర్వహ ణకు పెద్దపీటవేయాలని, బహిరంగ ప్రదేశాల్లో చెత్త పారబోసే వారిపై చర్యలు తీసుకో వాలని శానిటరీ ఇన్‌స్పెక్టరు మురళిని ఆదేశించారు. రామయ్యచెరువుతోపాటు పలు చెరువులు కాలుష్యానికి గురికాకుండా చర్యలుతీసుకోవాలని, దాడితల్లి గుడి వద్ద బ్యూటి ఫికేషన్ పనులు చేపట్టాలని ఆదేశించారు. సాలిడ్‌వేస్ట్‌మేనేజ్‌మెంట్ పార్కు నిర్వహణలో లోపాలను సరిచేసి దానికోసం పక్కా కార్యాచరణను అమలు చేయాలని ఆదేశించా రు. తడి, పొడిచెత్త సేకరించిన తర్వాత వాటిని సక్రమంగా వినియోగించాలని కోరారు.