Share News

అంగన్‌వాడీలను బడులుగా తీర్చిదిద్దండి

ABN , Publish Date - Nov 14 , 2026 | 12:34 AM

: అంగన్‌ వాడీ కేంద్రాలను కేవలం పోషకాహార కేంద్రాలుగానే కాకుండా పిల్లల తొలి బడులుగా తీర్చిదిద్దాలని ఐసీడీఎస్‌ పీవో చింతాడ హైమావతి అన్నారు.

అంగన్‌వాడీలను బడులుగా తీర్చిదిద్దండి
మాట్లాడుతున్న ఐసీడీఎస్‌ పీవో హైమావతి:

కోటబొమ్మాళి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): అంగన్‌ వాడీ కేంద్రాలను కేవలం పోషకాహార కేంద్రాలుగానే కాకుండా పిల్లల తొలి బడులుగా తీర్చిదిద్దాలని ఐసీడీఎస్‌ పీవో చింతాడ హైమావతి అన్నారు. స్థానిక జిల్లా పరిషత్‌ బాలికల పాఠశాలలో అంగన్‌వాడీ కార్యకర్తలక ఇస్తున్న శిక్షణ కార్యక్రమంలో శుక్రవారం ఆమె పాల్గొన్నారు. కోటబొమ్మాళి ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ పరిధిలోని కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాలకు చెరో రెండు రోజులు చొప్పున నాలుగు రోజుల పాటు శిక్షణ ఇచ్చినట్టు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2026 | 12:34 AM