Share News

బదిలీ అయిన న్యాయాధికారులకు సత్కారం

ABN , Publish Date - May 02 , 2026 | 12:01 AM

జిల్లా న్యాయస్థానాల్లో పనిచేసి ఇటీల బదిలీ అయిన పలువురు న్యాయాధి కారులకు బార్‌ అసోసి యేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం సత్కరించారు.

బదిలీ అయిన న్యాయాధికారులకు సత్కారం
జిల్లా అదనపు న్యాయాధికారి ఎం.ఫణికుమార్‌ని సత్కరిస్తున్న బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు

శ్రీకాకుళం లీగల్‌, మే (ఆంధ్రజ్యోతి): జిల్లా న్యాయస్థానాల్లో పనిచేసి ఇటీల బదిలీ అయిన పలువురు న్యాయాధి కారులకు బార్‌ అసోసి యేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం సత్కరించారు. 4వ అదనపు జిల్లా న్యాయాధికారి ఎం.ఫణి కుమార్‌, సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఎం.శ్రీధర్‌లకు బదిలీలయ్యాయి. న్యాయా ధికారి ఎం.శ్రీధర్‌కు పదోన్నతిపై విజయనగరం, అదనపు న్యాయాధికారి ఎం.ఫణి కుమార్‌కు గాజువాకకు బదిలీ అయింది. ఈ నేపథ్యంలో తమకు జరిగిన సత్కార కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. విధి నిర్వ హణలో న్యాయవాదుల సహకారం మరువలేనిదన్నారు. కార్యక్రమంలో 3వ అద నపు జిల్లా న్యాయమూర్తి వివేకా నంద శ్రీనివాస్‌, పోక్సో న్యాయస్థానం న్యాయా ధికారి నక్క సునీత, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి కె.అనురాగ్‌, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కూన రాజారావు, కార్యదర్శి సూర్యనారాయణ, జాయింట్‌ సెక్రటరీ ఈశ్వరరావు, పలువురు సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2026 | 12:01 AM