విధి నిర్వహణలో నైపుణ్యానికి శిక్షణ దోహదం
ABN , Publish Date - Apr 07 , 2026 | 12:03 AM
విధి నిర్వహణలో నైపుణ్యం పెంపొందించుకునేందుకు శిక్షణ దోహదం చేస్తుందని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ కేవీ రమణ అన్నారు.
డీటీసీ ప్రిన్సిపాల్ కేవీ రమణ
శ్రీకాకుళం క్రైం, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో నైపుణ్యం పెంపొందించుకునేందుకు శిక్షణ దోహదం చేస్తుందని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ కేవీ రమణ అన్నారు. విజయనగరం జిల్లాకు చెందిన 34 మంది ఏఆర్ పోలీసు కానిస్టేబుళ్ల ప్రీ ప్రమోషనల్ శిక్షణ సోమ వారంతో ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు 8 రోజుల పాటు ఇండోర్, అవుట్ డోర్ విభాగాల్లో శిక్షణ ఇచ్చారు. శారీరక ధృఢత్వం, క్రమశిక్షణ, విధి నిర్వహణ లో అవసరమైన సాంకేతిక నైపుణ్యాలపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి పరీక్షలను నిర్వహించారు. శిక్షణా కాలంలో ప్రతిభ చూపిన కానిస్టేబుళ్లకు ప్రశంసా పత్రాలను ఏఎస్పీ కేవీ రమణ అందించి అభినందించారు. కార్యక్రమంలో డీసీపీటీసీ వైస్ ప్రిన్సిపాల్ (డీఎస్పీ) డి.గోవింద రావు, పీఎల్‌ఐ (సీఐ) ఎం.కృష్ణమూర్తి, సీడీఐ (ఆర్‌ఐ) కేవీ నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.